Lord Shani Dev: శని వక్ర త్యాగం.. ఇక వారికి శుభ యోగాలు, ఆగిన పనులు పూర్తి..!
ప్రస్తుతం తన సొంత రాశి అయిన కుంభంలో వక్రగతిలో సంచరిస్తున్న శనీశ్వరుడు నవంబర్ 15 తర్వాత వక్ర త్యాగం చేస్తాడు. అంటే శని మళ్లీ రుజు వర్తనలోకి వస్తాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి గత కొంతకాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. రావలసిన డబ్బు తప్పకుండా చేతికి అందుతుంది. తప్పి పోయిన లేదా చేజారిన అవకాశాలు తిరిగి లభిస్తాయి. శుభ కార్యాలు మళ్లీ జోరందుకుంటాయి.

Lord Shani Dev
ప్రస్తుతం తన సొంత రాశి అయిన కుంభంలో వక్రగతిలో ఉన్న శనీశ్వరుడు నవంబర్ 15 తర్వాత వక్ర త్యాగం చేస్తాడు. అంటే శని మళ్లీ రుజు వర్తనలోకి వస్తాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. రావలసిన డబ్బు తప్పకుండా చేతికి అందుతుంది. తప్పి పోయిన లేదా చేజారిన అవకాశాలు తిరిగి లభిస్తాయి. శుభ కార్యాలు మళ్లీ జోరందుకుంటాయి. ఆటంకాలు, ఆలస్యాల నుంచి బయటపడతారు. మేషం, వృషభం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశులకు శనీశ్వరుడు తిరిగి శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభమవుతుంది.
- మేషం: ఈ రాశివారికి లాభ స్థానంలో ఉన్న లాభ స్థానాధిపతి శనీశ్వరుడు వక్రాన్ని వీడడంతో పదోన్నతు లకు, ఆదాయ వృద్ధికి మార్గం సుగమం అవుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం అవు తాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో సహాయ సహకారాలు లభిస్తాయి. శుభ కార్యాలు, విదేశీ ప్రయత్నాలు, నిరుద్యోగుల ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. సొంత ఇంటి కల నెర వేరుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. ప్రాధాన్యం బాగా పెరుగుతుంది.
- వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల శశ మహా పురుష యోగ ఫలితాలు అనుభవా నికి రావలసి ఉంది. శని వక్రగతి వల్ల ఆగిపోయిన యోగాలు ఇక సత్ఫలితాలనివ్వడం ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. రాజకీయ ప్రముఖులతో లాభ దాయక సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పట్టిందల్లా బంగారం అవుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందే అవకాశం ఉంది.
- కన్య: ఈ రాశికి ఆరవ స్థానంలో, స్వస్థానంలో ఉన్న శని సాధారణంగా ఆరోగ్య, ఆర్థిక, శత్రు సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే, వక్రగతి వల్ల వీటికి ఆటంకాలు ఏర్పడతాయి. నవంబర్ 15 తర్వాత నుంచి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెంది ఆర్థిక సమస్యలు చాలావరకు పరి ష్కారం అవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో మీదే పైచేయిగా మారి పురోగతి చెందుతారు. ఉద్యోగంలో సహోద్యోగులను మించి పోయి, ఉన్నత స్థానాలను పొందుతారు. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. మనశ్శాంతి కలుగుతుంది.
- తుల: ఈ రాశికి 4,5 స్థానాల అధిపతిగా అత్యంత శుభుడైన శనీశ్వరుడు వక్రించడం వల్ల శుభ ఫలితాలు తగ్గిపోవడం జరుగుతుంది. వక్ర త్యాగం వల్ల అన్ని పరిస్థితులూ అనుకూలంగా మారతాయి. పెళ్లి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ప్రేమ వ్యవహారాలు సానుకూలపడతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. సొంత ఇల్లు అమరుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు అనేక విధాలుగా వృద్ధిని, పురోగతిని కలిగించాల్సి ఉంటుంది. వక్రగతి వల్ల ఆగిపోయిన ఆదాయ వృద్ధి, వివిధ రంగాలలో పురోగతి ఇక ఊపందుకునే అవకాశం ఉంది. ఆదాయం అనేక వైపుల నుంచి వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కడం జరుగుతుంది. సమర్థతకు, ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాలు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది.
- మకరం: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న శని వక్రించడం వల్ల రావలసిన సొమ్ము ఆగిపోవడం, ఆదాయం పెరగకపోవడం, పదోన్నతి లభించకపోవడం, ఆశించిన గుర్తింపు రాకపోవడం వంటివి జరుగుతాయి. ఇక ఈ సమస్యల నుంచి క్రమంగా బయటపడడం జరుగుతుంది. ఆదాయం గణనీయంగా వృద్ధి చెందుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.



