Weekly Horoscope: ఆ రాశి నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (నవంబర్ 10 నుంచి నవంబర్ 16, 2024 వరకు): మేష రాశి వారు ఈ వారం ఆర్థిక వ్యవహారాల్లోనూ, ఆర్థిక లావాదేవీల్లోనూ వీలైనంత అప్రమత్తంగా ఉండడం మంచిది. వృషభ రాశి వారికి నూతన వాహన యోగం ఉంది. వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగ యోగం పడుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 10, 2024 | 5:01 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వ్యాపారాలు బాగా ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో విహార యాత్ర చేస్తారు. చేపట్టిన పనులు, వ్యవహారాలన్నీ ఆశాజనకంగా సాగుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆదాయపరంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లోనూ, ఆర్థిక లావాదేవీల్లోనూ వీలైనంత అప్రమత్తంగా ఉండడం మంచిది. ఇతరుల వాద వివాదాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి  పెరుగుతుంది. భరణి నక్షత్రం వారికి ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. ఆదిత్య హృదయ పఠనం చాలా మంచిది.

1 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. నూతన వాహన యోగం ఉంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగాల్లో బాధ్యతలు మారి, ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగు తుంది. కుటుంబసమేతంగా విహార యాత్ర చేసే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. రోహిణి నక్షత్రం వారికి బాగా ధన లాభాలు కలుగుతాయి. విష్ణు సహస్ర నామ స్తోత్ర పఠనం వల్ల లాభం కలుగుతుంది.

2 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): మనసులోని కోరికలు నెరవేరుతాయి. శుభ గ్రహాల అనుకూలత వల్ల ఆర్థిక లాభాలు కలుగు తాయి. ఇష్టమైన ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆదాయం బాగా పెరగడానికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ వంటివి ఆశించిన లాభాలనిస్తాయి. బంధుమిత్రులకు సహాయంగా నిలబడతారు. వృత్తి, వ్యాపా రాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఉద్యోగాల్లో అనుకూలతలు పెరగడంతో పాటు కొత్త అవకాశాలు లభించడం కూడా జరుగుతుంది. నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగ యోగం పడుతుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. పునర్వసు వారికి అధికార యోగం పడుతుంది. ప్రతి రోజూ సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

3 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): శని, రవి, కుజ, బుధ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఎటువంటి ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ఆర్థిక విషయాలు రాణిస్తాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వ్యాపారంలో బాగా బిజీ అవుతారు. యాక్టివిటీ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక సహాయం విషయంలో బంధుమిత్రుల నుంచి కొద్దిగా ఇబ్బందులుంటాయి. కుటుంబపరంగా బాధ్యతలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలు అవుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి. పుష్యమి నక్షత్రం వారికి మరింతగా బాగుంటుంది.

4 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగిపో తాయి. కుటుంబంతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఇంటా బయటా అనుకూలతలు కలుగుతాయి. అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు పూర్తి చేస్తారు. ప్రయాణాలు బాగా అనుకూలంగా సాగుతాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సరైన స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం కలుగుతుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. బంధువుల వివాదాల్లో జోక్యం చేసుకుని ఇబ్బంది పడతారు.  పుబ్బా నక్షత్రం వారికి పదోన్నతికి అవకాశం ఉంది. ధనపరంగా ఎవరికీ హామీలు ఉండవద్దు. దుర్గాస్తోత్రం చదువుకోవడం మంచిది.

5 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు కానీ, అనుకోని ఖర్చుల వల్ల కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఒకటి రెండు ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు  పరిష్కా రమయ్యే సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి.  వ్యాపారాల్లో మీ ప్రయత్నాల వల్ల లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. అను కోకుండా పెళ్లి ప్రయత్నాలు ఫలించి, దూరపు బంధువులతో సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి. విద్యార్థులు ఆశించిన విజయాలు సాధిస్తారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.  ఉత్తరా నక్షత్రం వారు ఏది తలపెట్టినా విజయవంతం అవుతుంది.

6 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ రాశివారికి ఊహించని ధన యోగం పడుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుం డదు. ముఖ్యంగా ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయం మార్గాలు విస్తరిస్తాయి. ఇంటి ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఇష్టమైన బంధుమిత్రులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. జీవిత భాగస్వామితో దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా బలం పుంజుకుంటాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. స్వాతి, విశాఖ నక్షత్రాల వారికి అధికార యోగం పడుతుంది. సుందరకాండ పారాయణం వల్ల శుభాలు కలుగుతాయి.

7 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.  ఆర్థికపరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలకు లోటుండదు. స్వల్ప అనారోగ్యాలతో ఇబ్బంది పడతారు. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసు కుంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. చేప ట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవు తాయి. వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. దూర ప్రాంత బంధు వులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కొద్ది శ్రమతో విద్యార్థులు రాణిస్తారు. అనూరాధ నక్షత్రం వారు ఆశించిన శుభవార్త వింటారు. కాలభైరవాష్టకం చదువుకోవడం చాలా మంచిది.

8 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అయ్యే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి జీవితం మరింత మెరుగ్గా, సానుకూలంగా సాగిపోతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగంలో అధికారులు మీ సలహాలు, సూచనలతో ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యు లతో వివాదాలు తొలగుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు.  ప్రేమ వ్యవహారాల్లో దూసుకు పోతారు. పూర్వాషాఢ వారికి విదేశీ అవకాశాలు లభిస్తాయి. గణపతి స్తోత్ర పఠనం చాలా మంచిది.

9 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. డబ్బు ఇచ్చి పుచ్చుకునే విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎంతో శ్రమపడి ఆదాయాన్ని పెంచుకోవడం జరుగుతుంది. ఒకరిద్దరు మిత్రులతో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం అవ సరం. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అధికార యోగం పడుతుంది. శివార్చన చేయించడం చాలా మంచిది.

10 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వ్యక్తిగతంగా ఒకటి రెండు సమస్యలు తప్పకపోవచ్చు. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆస్తి వివాదానికి పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. అనుకున్న సమయానికి ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగ జీవితంలో అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. జీవిత భాగ స్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపో తాయి. ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది. రావలసిన డబ్బు సకా లంలో చేతికి అందుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. పూర్వాభాద్ర నక్షత్రం వారికి ప్రమోషన్ లభిస్తుంది. శివార్చన వల్ల శని దోషం తగ్గుతుంది.

11 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. తలపెట్టిన పనులన్నిటినీ పట్టు దలగా పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులకు సహాయ సహకారాలు అందజేస్తారు. మంచి పరి చయాలు ఏర్పడతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు, లక్ష్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా నిలకడగా ముందుకు సాగు తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి, ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులకు కొద్దిపాటి శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. సుందరకాండ పారాయణం ఉత్తమం.

12 / 12
Follow us