Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఆఫర్లు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (నవంబర్ 9, 2024): మేష రాశి వారికి ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యలు తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఆఫర్లు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
Horoscope Today 09th November 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 09, 2024 | 5:01 AM

దిన ఫలాలు (నవంబర్ 9, 2024): మేష రాశి వారికి ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యలు తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో కొన్ని బాధ్యతలు మారే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆదాయం బాగా పెరుగుతుంది కానీ, విలాసాల మీద ఖర్చులకు అదుపు ఉండకపోవచ్చు. కొన్ని వ్యక్తిగత నుంచి అప్రయత్నంగా విముక్తి లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ధన సంబంధమైన వ్యవహారాలు, ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారుల నుంచి అనుకూలతలు, సహచరుల నుంచి ఇబ్బందులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఉన్నా లాభాలకు లోటుండదు. అనుకున్న పనులు అనుకు న్నట్టు పూర్తవుతాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు. సొంత పనుల మీద శ్రద్ధపెట్టడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు, పనులు, ప్రయత్నాలు చాలా వరకు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి పెడతారు. ప్రయాణాల్లోనూ, ఆహార, విహారాల్లోనూ జాగ్రత్తలు పాటించాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు కొద్ది ప్రయత్నంతో సకాలంలో పూర్తవు తాయి. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. దగ్గరి బంధువుల నుంచి శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఊహించని విధంగా ధన లాభాలు కలుగుతాయి. ఉన్నత వర్గాలతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం ఖాయమవుతుంది. తల్లితండ్రుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. కొందరు ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ధనాదాయంలో కొద్దిగా హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. ఖర్చుల విషయంలోనే కాక, ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయడం మంచిది. ముఖ్యంగా ఆర్థిక విష యాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. కుటుంబ జీవితం చాలా వరకు సాఫీగా సాగి పోతుంది. వ్యాపారంలో కొద్దిపాటి మార్పులు చేపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచ నల వల్ల లాభం కలుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు తగిన ఫలితాలనిచ్చే అవకాశం ఉంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా పురోగతి చెందుతాయి. ఆదా యానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థికంగా నష్టపోయే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతల వల్ల శ్రమ, ఒత్తిడి తప్పక పోవచ్చు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. పిల్లల విద్యా విషయాల మీద శ్రద్ధ పెంచడం మంచిది.. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ధనపరంగా నష్టపోవడం లేదా మోస పోవడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో ఇత రుల మీద ఆధారపడకపోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు లాభిస్తాయి. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకోవడం జరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. రావలసిన సొమ్మును వసూలు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి జీవితంలో ఉన్నవారికి డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబపరంగా ఒత్తిడి ఉంటుంది. వీలైనంతగా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో అధికారులు కాస్తంత ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబ జీవితం హ్యాపీగా గడిచిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా పూర్త వుతాయి. నిరుద్యోగులు శుభ వార్తలు వింటారు. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. దైవ కార్యాల్లో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి జీవితం బిజీ అవుతుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక వ్యవహా రాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ ఖర్చులు అదుపు తప్పుతాయి. ప్రయాణాలలోనూ, ఆహార విహారాల్లోనూ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.