Lord Shani Dev: వక్ర శనితో వారికి ఆటంకాల నుంచి విముక్తి.. ఇక జీవితంలో పైపైకి..!

ప్రస్తుతం కుంభ రాశిలో అతిగా వక్రించి ఉన్న శనీశ్వరుడు నవంబర్ 15 వరకూ తన వక్రగతిని కొనసాగిస్తాడు. క్రమశిక్షణకు, నీతి నిజాయతీలకు, నియమ నిష్ఠలకు కారకుడైన శని ఈ వక్ర గమన కాలంలో కొన్ని రాశులకు క్రమశిక్షణలో పెట్టడం, ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించేలా చేయడం, ఆదాయ, ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగించడం..

Lord Shani Dev: వక్ర శనితో వారికి ఆటంకాల నుంచి విముక్తి.. ఇక జీవితంలో పైపైకి..!
Lord Shani Dev
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 05, 2024 | 4:16 PM

ప్రస్తుతం కుంభ రాశిలో అతిగా వక్రించి ఉన్న శనీశ్వరుడు నవంబర్ 15 వరకూ తన వక్రగతిని కొనసాగిస్తాడు. క్రమశిక్షణకు, నీతి నిజాయతీలకు, నియమ నిష్ఠలకు కారకుడైన శని ఈ వక్ర గమన కాలంలో మేషం, సింహం, వృశ్చికం, మకరం, కుంభ రాశులకు క్రమశిక్షణలో పెట్టడం, ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించేలా చేయడం, ఆదాయ, ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగించడం, దోషాలను, లోపాలను పరిష్కరించడం వంటివి చేయడం జరుగుతుంది. పైకి కష్టంగా కనిపించినా భవిష్యత్తుకు అవసరమైన పనులు చేస్తాడు.

  1. మేషం: ఈ రాశికి లాభ స్థానంలో వక్ర గతిలో ఉన్న శనీశ్వరుడు ప్రధానంగా ఆదాయ వృద్ధికి సంబంధిం చిన ఆటంకాలను, విఘ్నాలను తొలగించడం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో సరైన దారిని చూపించే అవకాశం ఉంది. అనవసర పరిచయాలు, వ్యసనాల నుంచి ఈ రాశివారిని బయటపడేసే అవకాశం ఉంది. అనవసర ఖర్చుల్ని తగ్గించి, పొదుపు, మదుపు అలవాట్లకు అవకాశం కల్పించ డం జరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొద్ది శ్రమతో ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది.
  2. సింహం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో వక్ర గమనంలో శని వీలైనంతగా క్రమశిక్షణలో ఉంచడం జరుగు తుంది. అవినీతి కార్యకలాపాలను, రహస్య కార్యకలాపాలను సాగనివ్వడు. నీతి నిజాయతీలతో చేసే ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తాడు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిస్తాడు. వ్యసనాల నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంది. కష్టార్జితం పెరగడానికి అనేక అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కలిగిస్తాడు.
  3. వృశ్చికం: ఈ రాశికి నాలుగవ స్థానంలో శని వక్ర సంచారం వల్ల కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. గృహ, వాహన సౌకర్యాలకు అవకాశం ఏర్పడుతుంది. మంచి పరిచయాలు కలుగుతాయి. ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఉండదు. ఉద్యోగంలో బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ ప్రతిఫలానికి ఎక్కువ శ్రమ ఉంటుంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉండదు. జీవితంలోని కొన్ని లోపాలు, దోషాలు తొలగిపోతాయి.
  4. మకరం: ధన స్థానంలో ఉన్న వక్ర శని వల్ల ఈ రాశివారికి ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. ఉచిత సహా యాలు, దానధర్మాలకు బ్రేకులు పడతాయి. ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు పాటించడం, ఆదాయ మార్గాల్లో మదుపు చేయడం వంటివి జరుగుతాయి. ఆహార, విహారాల్లో కూడా జాగ్రత్తలు పాటించడం జరుగుతుంది. వ్యసనాలకు దూరం అవుతారు. విలాసవంతమైన జీవితానికి కూడా స్వస్తి చెప్పే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఎంతో శ్రమ మీద సానుకూలపడతాయి.
  5. కుంభం: ఈ రాశిలో ఉన్న వక్ర శని ఎంతో కఠినంగా క్రమశిక్షణను పాటింపజేస్తాడు. నియమ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చేస్తాడు. కష్టార్జితాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ వృథా కానివ్వడు. ఒక్కొక్క సమస్యను ఒక ప్రణాళిక ప్రకారం పరిష్కరించడం జరుగుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరగడా నికి అవకాశం ఉంది. చెడు స్నేహాల నుంచి బయటపడేస్తాడు. మంచి పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగ జీవితంలో నిదానంగా పదోన్నతులు లభిస్తాయి. స్వయం కృషితోనే ప్రతిదీ సాధ్యమవు తుంది.