AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: మూడు శుభ గ్రహాల మార్పు.. ఇక ఆ రాశుల వారికి అంతా శుభమే..!

రెండు మూడు రోజుల తేడాతో గురు, శుక్ర, బుధులు కొత్త అవతారం ఎత్తుతున్నాయి. ఈ నెల 11న గురువు వక్రించడం, బుధుడు తులా రాశిలో ప్రవేశించడం జరుగుతుండగా, 13న శుక్రుడు వృశ్చిక రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ మూడు గ్రహాల మార్పు వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో తప్పకుండా సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Zodiac Signs: మూడు శుభ గ్రహాల మార్పు.. ఇక ఆ రాశుల వారికి అంతా శుభమే..!
Telugu Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 10, 2024 | 4:55 PM

Share

రెండు మూడు రోజుల తేడాతో గురు, శుక్ర, బుధులు కొత్త అవతారం ఎత్తుతున్నాయి. ఈ నెల 11న గురువు వక్రించడం, బుధుడు తులా రాశిలో ప్రవేశించడం జరుగుతుండగా, 13న శుక్రుడు వృశ్చిక రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ మూడు గ్రహాల మార్పు వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో తప్పకుండా సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా చాలా కాలంగా పెండింగులో ఉన్న శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందడం, మొండి బాకీలు వసూలు కావడం వంటివి జరుగుతాయి. వృషభం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మకర రాశుల వారు దీనివల్ల బాగా లబ్ధి పొందే అవకాశం ఉంది.

  1. వృషభం: ఈ రాశికి ఈ మూడు గ్రహాల మార్పు ఎంతో శుభం చేకూర్చబోతోంది. ఆదాయం బాగా పెరగడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. పెళ్లి, గృహ ప్రవేశాలు, భూమి పూజలు వంటి శుభ కార్యాలు జరుగు తాయి. తల్లితండ్రులు లేదా పిల్లలు ఇంటికి రావడం జరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. పిల్లలకు శ్రద్ధ పెరుగుతుంది.
  2. కర్కాటకం: ఈ రాశికి మూడు శుభ గ్రహాలు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల అష్టమ శని ప్రభావం కూడా పూర్తిగా తగ్గిపోయి, అనేక కష్టనష్టాల నుంచి బయటపతారు. గృహ నిర్మాణ వ్యవహారాలు ఊపందుకుంటాయి. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. పెండింగులో ఉన్న శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  3. కన్య: ఈ రాశికి ఈ శుభ గ్రహాల మార్పుతో రాశ్యధిపతి, భాగ్యాధిపతి బలంగా మారినందువల్ల చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా అంది వస్తాయి. విదేశీ సొమ్ము అనుభవించే యోగం కలుగుతుంది. పెళ్లి విషయంలో విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. సంతాన యోగం కలిగే అవకాశం ఉంది.
  4. తుల: ఈ రాశికి ఈ మూడు శుభ గ్రహాల అనుకూలత వల్ల ఉద్యోగ జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలో యాక్టివిటీ వృద్ధి చెందుతుంది. లాభాలకు లోటుండదు. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా కలిసి వస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సునాయాసంగా నెరవేరుతుంది. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.
  5. వృశ్చికం: ఈ రాశివారికి ఈ శుభ గ్రహాల అనుకూల సంచారం వల్ల శుభ కార్యాలు జరపగలుగుతారు. అందుకు తగ్గ ఆదాయ వనరులు తేలికగా సమకూరుతాయి. రావలసిన డబ్బు, రాదనుకున్న సొమ్ము కూడా చేతికి అందుతాయి. గృహ, వాహన సౌకర్యాలు సమకూరుతాయి. వృత్తి, వ్యాపా రాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు.
  6. మకరం: ఈ రాశికి ఈ మూడు శుభ గ్రహాలతో పాటు శని, రాహువులు కూడా బాగా అనుకూలంగా ఉన్నం దువల్ల ముఖ్యమైన వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలు పరిష్కారం కావడంతో పాటు ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. రాజపూజ్యాలు కలుగు తాయి. ఉద్యోగంలో పదోన్నతులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఇంట్లో పెళ్లి లేదా గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరుగుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.

రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO