AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kuja Gochar 2024: మకర రాశిలోకి కుజుడు.. ఆ రాశుల వారికి మహా భాగ్య యోగం పక్కా.. !

ఈ నెల 6వ తేదీ నుంచి కుజుడు తనకు ఉచ్ఛ స్థానమైన మకర రాశిలో తన సంచారాన్ని ప్రారంభించడం జరుగుతోంది. మార్చి 15 వరకు కుజుడి ఉచ్ఛ స్థితి కొనసాగుతుంది. ఏదైనా రాశికి కేంద్రంలో, అంటే 1,4,7,10 స్థానాల్లో కుజుడు ఉచ్ఛ పట్టడం గానీ, స్వక్షేత్రంలో ఉండడం గానీ జరిగినప్పుడు పంచ మహా పురుష యోగాల్లో ఒకటైన రుచక యోగం పడుతుంది. దీనివల్ల ఎవరు ఏ రంగంలో ఉన్నా వారు తప్పకుండా అందలాలు అధిరోహిస్తారు.

Kuja Gochar 2024: మకర రాశిలోకి కుజుడు.. ఆ రాశుల వారికి మహా భాగ్య యోగం పక్కా.. !
Kuja Gochar 2024
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Feb 04, 2024 | 9:38 PM

Share

ఈ నెల 6వ తేదీ నుంచి కుజుడు తనకు ఉచ్ఛ స్థానమైన మకర రాశిలో తన సంచారాన్ని ప్రారంభించడం జరుగుతోంది. మార్చి 15 వరకు కుజుడి ఉచ్ఛ స్థితి కొనసాగుతుంది. ఏదైనా రాశికి కేంద్రంలో, అంటే 1,4,7,10 స్థానాల్లో కుజుడు ఉచ్ఛ పట్టడం గానీ, స్వక్షేత్రంలో ఉండడం గానీ జరిగినప్పుడు పంచ మహా పురుష యోగాల్లో ఒకటైన రుచక యోగం పడుతుంది. దీనివల్ల ఎవరు ఏ రంగంలో ఉన్నా వారు తప్పకుండా అందలాలు అధిరోహిస్తారు. అనేక విధాలుగా వారి ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ప్రముఖ వ్యక్తుల్లో ఒకరుగా గుర్తింపు పొందుతారు. ఆర్థికంగా, కెరీర్ పరంగా, వృత్తిపరంగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ప్రస్తుతం కుజుడి మకర రాశి సంచారం వల్ల మేషం, కర్కాటకం, తుల, మకర రాశులకు ఈ రుచక మహా పురుష యోగం ఏర్పడింది. ఈ నాలుగు రాశులతో పాటే కుజుడి ఉచ్ఛ స్థితి కారణంగా ధనుస్సు, మీన రాశులకు మహా భాగ్య యోగం ఏర్పడింది.

  1. మేషం: ఈ రాశ్యధిపతి కుజుడు దశమ స్థానంలో ఉచ్ఛపట్టడమే ఒక విశేషం కాగా, ఇది రుచక మహా పురుష యోగాన్ని కూడా కలిగించడం మరో విశేషం. ఈ రాశివారికి తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఒక పెద్ద సంస్థలో నిర్వహణ బాధ్యతలు చేపట్టడం కూడా జరుగుతుంది. వృత్తి, ఉద్యో గాల్లో అన్ని విధాలుగానూ ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాల్లో కూడా ఇబ్బడిముబ్బడిగా లాభా లార్జిస్తారు. అత్యధిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందుతారు.
  2. కర్కాటకం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో కుజుడు ఉచ్ఛపట్టినందువల్ల, ఈ రాశివారికి కుజుడు అత్యంత శుభుడైనందువల్ల ఈ రాశివారు ఏ రంగానికి చెందినవారైనప్పటికీ వీరికి ఏ విషయంలోనూ పట్ట పగ్గాలుండవు. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా అధికార యోగం పడుతుంది. వ్యాపారాల్లో ఎదురు లేకుండా ఉంటుంది. ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా సంపన్న వ్యక్తితో పెళ్లి జరగడమో, ప్రేమలో పడడమో జరుగుతుంది. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి.
  3. తుల: ఈ రాశివారికి ధన, కళత్ర స్థానాధిపతి అయిన కుజుడు నాలుగవ స్థానంలో ఉచ్ఛ పట్టడం వల్ల రుచక మహా పురుష యోగం ఏర్పడింది. వీరు ఆర్థికంగా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో వీరి మాటకు, చేతకు తిరుగుండదు. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కావడమో, ప్రేమలో పడడమో జరుగుతుంది. కెరీర్ పరంగానే కాక సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
  4. ధనస్సు: ఈ రాశివారికి ధన స్థానంలో కుజుడు ఉచ్ఛపట్టడం వల్ల అనేక విధాలుగా ఆర్థిక బలం పెరుగు తుంది. గృహ, వాహన సౌకర్యాలకు రుణం కోసం ప్రయత్నిస్తున్నవారికి సకాలంలో సహాయం లభి స్తుంది. ఎటువంటి ఆర్థిక ప్రయత్నమైనా కలిసి వస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఘన విజయం సాధిస్తాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరు విదేశాల్లో మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి.
  5. మకరం: ఈ రాశికి చతుర్థ, లాభాధిపతి అయిన కుజుడు ఈ రాశిలో ఉచ్ఛ పడుతున్నందువల్ల ఈ రాశి వారికి రుచక మహా పురుష యోగం ఏర్పడింది. ఫలితంగా వీరికి ప్రతి రంగంలోనూ ప్రాబల్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారం చేపట్టడం లేదా మంచి సంస్థకు అధిపతి కావడం జరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. కీలకమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థికంగా తిరుగులేని పురోగతి ఉంటుంది.
  6. మీనం: ఈ రాశికి ధన, భాగ్యాధిపతిగా అత్యంత శుభుడైన కుజుడు లాభస్థానంలో ఉచ్ఛ పడుతున్నందు వల్ల అపారమైన ధన లాభం కలుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు తప్పకుండా విజయం సాధిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరగడంతో పాటు, జీత భత్యాలు కూడా ఆశించిన దాని కంటే బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి వృద్ధి చెందుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.