Zodiac Signs: రెండుగ్రహాల మధ్య నక్షత్ర పరివర్తన.. వారికి అధికార, గృహ, ఉద్యోగ యోగాలు

ఈ నెల 29 నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు కుజ, గురువులు కొన్ని రాశులకు శుభ యోగాలు కలిగించబోతున్నాయి. కుజుడికి చెందిన మృగశిర నక్షత్రంలో గురువు, గురువుకు చెందిన పునర్వసు నక్షత్రంలో కుజుడి సంచారం వల్ల ఈ రెండు గ్రహాలు అధికార యోగం, గృహ యోగం, ఉద్యోగ యోగం కలిగించే అవకాశం ఉంది.

Zodiac Signs: రెండుగ్రహాల మధ్య నక్షత్ర పరివర్తన.. వారికి అధికార, గృహ, ఉద్యోగ యోగాలు
Zodiac Signs
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 28, 2024 | 6:32 PM

ఈ నెల 29 నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు కుజ, గురువులు కొన్ని రాశులకు శుభ యోగాలు కలిగించబోతున్నాయి. కుజుడికి చెందిన మృగశిర నక్షత్రంలో గురువు, గురువుకు చెందిన పునర్వసు నక్షత్రంలో కుజుడి సంచారం వల్ల ఈ రెండు గ్రహాలు అధికార యోగం, గృహ యోగం, ఉద్యోగ యోగం కలిగించే అవకాశం ఉంది. మేషం, వృషభం, సింహం, కన్య, వృశ్చికం, ధనూ రాశులు ఈ నక్షత్ర పరివర్తన వల్ల అత్యధికంగా ప్రయోజనం పొందడం జరుగుతుంది.

  1. మేషం: ఈ రాశినాథుడైన కుజుడికి గురువుతో నక్షత్ర పరివర్తన జరిగినందువల్ల అనేక శుభవార్తలు వినడం జరుగుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బు తప్పకుండా వసూలవుతుంది. మాటకు విలువ పెరుగు తుంది. ఉద్యోగంలో అధికారులకు మీ వల్ల లాభం కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి తీర్థ యాత్రలు చేయడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు బాగా అనుకూలంగా పరిష్కారం అవుతాయి.
  2. వృషభం: ఈ రాశిలో ఉన్న గురువుతో ధన స్థానంలో ఉన్న కుజుడికి నక్షత్ర పరివర్తన జరిగినందువల్ల అనేక విధాలుగా ఆదాయం పెరగడంతో పాటు అప్రయత్నంగా కూడా ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో వేతనాల పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు వింటారు. పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశీయానానికి సంబంధిం చిన ఆటంకాలు తొలగిపోతాయి. కొందరు ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.
  3. సింహం: ఈ రాశికి దశమంలో ఉన్న గురువుకు, లాభ స్థానంలో ఉన్న కుజుడికి నక్షత్ర పరివర్తన కలిగినం దువల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతోంది. హోదా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా విదే శాలు వెళ్లవలసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో ఆశించిన ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. కుటుంబ జీవితం ఆర్థికంగా బాగా మెరు గుపడుతుంది. ప్రధానమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.
  4. కన్య: ఈ రాశికి నవమ స్థానంలో ఉన్న గురువుతో, దశమ స్థానంలో ఉన్న కుజుడికి నక్షత్ర పరివర్తన ఏర్పడినందువల్ల ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకోవడం, ఆదాయ ప్రయత్నా లన్నీ ఊహించని ప్రయోజనాలు కలిగించడం జరుగుతుంది. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్న మైనా విజయవంతం అవుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబంలో ముఖ్యమైన శుభ కార్యాలు జరుగుతాయి.
  5. వృశ్చికం: ఈ రాశినాథుడైన కుజుడికి, ధనాధిపతి అయిన గురువుకు నక్షత్రాల మార్పిడి జరిగినందువల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆదాయపరంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజ యవంతం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికార యోగంతో పాటు వేతనాల వృద్ధి కూడా ఉంటుంది. ఉద్యోగ రీత్యా విదేశాలు వెళ్లవలసి వస్తుంది. ప్రముఖుల తోడ్పాటుతో పురోగతి సాధించడం జరుగుతుంది.
  6. ధనుస్సు: రాశినాథుడైన గురువుకు కుజుడితో నక్షత్ర పరివర్తన జరిగినందువల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. మహా భాగ్య యోగం పట్టే అవకాశం ఉంది. ఆదాయానికి సంబంధించి ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ప్రాభవం బాగా పెరుగుతుంది. మరింత మంచి ఉద్యో గంలోకి మారడానికి కూడా అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. కుటుంబంలోశుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి.

మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో