Kharmas: సూర్యుడి రథంలో గాడిదలు.. ఈ రథంలో సూర్యుడు ఎప్పుడు ప్రయాణిస్తాడు.. పురాణ కథ ఏమిటంటే..

|

Dec 30, 2023 | 11:25 AM

మార్కండేయ పురాణ ప్రకారం సూర్యుడు 7 గుర్రాల రథంపై నిరంతరం కదులుతాడు. అయితే ఒకసారి సూర్యడు రథాన్నీ లాగుతూ గుర్రాలు చాలా దూరం ప్రయాణించాయి. అప్పుడు వర్షాకాలం కొనసాగుతోంది. సమీపంలోని చెరువును చూసి నీటిని తాగడం కోసం గుర్రాలు అక్కడే ఆగిపోయాయి. అయితే సూర్యదేవుడు నీటిని తాగుతున్న గుర్రాల కోసం ఆగలేకపోయాడు. అప్పుడు సూర్యదేవ్ చెరువు ఒడ్డున ఉన్న గాడిదలను చూశాడు.

Kharmas: సూర్యుడి రథంలో గాడిదలు.. ఈ రథంలో సూర్యుడు ఎప్పుడు ప్రయాణిస్తాడు.. పురాణ కథ ఏమిటంటే..
Kharmas
Follow us on

హిందువులు ప్రత్యక్ష దైవంగా ఆరాధించే సూర్యభగవానుడి రథం మీద ప్రయాణిస్తాడని నమ్మకం. సూర్యుడి  రథానికి 7 గుర్రాలు ఉంటాయని అందరికి తెలిసిందే.. అయితే సూర్య భగవానుడు తన రథానికి రెండు గాడిదలను జోడించి ప్రయాణిస్తాడని మీకు తెలుసా.. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన సమయంలో  ఖర్మాలు మొదలవుతాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి నెలల మధ్య ఖర్మాలు ఏర్పడతాయి.  ఈసారి కూడా ఖర్మాలు 16 డిసెంబర్ 2023 నుండి మొదలై 14 జనవరి 2024 వరకు కొనసాగుతాయి. అయితే ఖర్మా అంటే గాడిద అని అర్ధం. ఖర్మ మాసానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథ కూడా గాడిదలకు సంబంధించినది.

మార్కండేయ పురాణ ప్రకారం సూర్యుడు 7 గుర్రాల రథంపై నిరంతరం కదులుతాడు. అయితే ఒకసారి సూర్యడు రథాన్నీ లాగుతూ గుర్రాలు చాలా దూరం ప్రయాణించాయి. అప్పుడు వర్షాకాలం కొనసాగుతోంది. సమీపంలోని చెరువును చూసి నీటిని తాగడం కోసం గుర్రాలు అక్కడే ఆగిపోయాయి. అయితే సూర్యదేవుడు నీటిని తాగుతున్న గుర్రాల కోసం ఆగలేకపోయాడు. అప్పుడు సూర్యదేవ్ చెరువు ఒడ్డున ఉన్న గాడిదలను చూశాడు. వెంటనే ఆ గాడిదలను తన రథానికి చేర్చుకుని తన తదుపరి ప్రయాణాన్ని కొనసాగించాడు.

అయితే గుర్రాలకు బదులుగా గాడిదలను కట్టుకున్న రథం మీద సూర్యుడు వేగంగా ప్రయాణించ లేకపోయాడు. ఎందుకంటే గాడిదల వేగం గుర్రాల కంటే చాలా తక్కువగా ఉంది. అలా ఒక నెల రోజులు పాటు గాడిదలతో తన రథం మీద పయనించాడు. ఒక నెల తర్వాత సూర్య దేవుడు అదే చెరువు సమీపంలోకి చేరుకున్నప్పుడు.. అప్పుడు గుర్రాల అలసట మాయమై.. నీరు త్రాగి మళ్లీ ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాయి. సూర్యదేవుడు తన రథం నుండి గాడిదలను తీసి మళ్లీ తన ఏడు గుర్రాలను చేర్చి ముందుకు ప్రయాణం ప్రారంభించాడు.

ఇవి కూడా చదవండి

ఖర్మాసం ఎప్పుడు వస్తుందో తెలుసా?

సూర్యదేవుడు తన రథానికి గాడిదలను చేర్చుకున్న మాసాన్ని ఖర మాసంగా పిలుస్తారు. అందుచేత ప్రతి సంవత్సరం సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడల్లా దానిని ఖర మాసం అంటారు. ఈ మాసంలో వివాహం మొదలైన శుభ కార్యాలు చేయరు. ఖర్మాసం ముగిసిన తర్వాతే శుభ కార్యాలు మళ్లీ ప్రారంభమవుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు