జ్యోతిష్య శాస్త్రంలో నవ గ్రహాలకు, రాశులకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. నవ గ్రహాల్లో ఒకటి బృహస్పతి .. ఈ గ్రహాన్ని గురువు అని కూడా అంటారు. గ్రహాలకు మాత్రమే కాదు దేవుళ్ళకు కూడా బృహస్పతి గురువుగా పరిగణిస్తారు. ఏడాదికి ఒక సారి గురువు తన రాశిని మార్చుకుంటాడు. ఇలా బృహస్పతి రాశి మార్చు కారణంగా 12 సంవత్సరాలకు ఒకసారి నదులకు పుష్కరాలు వస్తాయి. బృహస్పతి 12 ఏళ్ల తర్వాత వృషభరాశిలోకి మే 2024లో ప్రవేశించాడు. జూన్ 13, 2024 న బృహస్పతి రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఆగష్టు చివరి వారంలో 2024 వరకు ఈ రాశిలో సంచరించనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి ఆర్ధిక లాభాలతో పాటు, పెళ్లి ప్రయత్నాలు చేసే వ్యక్తుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు.. ఇతని నక్షత్ర రాశిలో దేవ గురువు సంచరిస్తున్నాడు. దీంతో మూడు రాశులకు చెందిన వారికి అపర ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
వృషభ రాశి: గురువు రోహిణి నక్షత్రంలో సంచరించడం ఈ రాశికి చెందిన వ్యక్తులకు శుభాలను కలిగిస్తుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులు వేగవంతంగా సాగుతాయి. ఈ రాశికి చెందిన యువతీ యువకుల పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పనికి తగిన విధంగా సానుకూల ఫలితాలను అందుకుంటారు. వ్యాపారస్తులకు పెట్టుబడులకు తగిన సమయం. ఆర్ధికంగా లాభాలు తెస్తుంది.
సింహ రాశి: నవ గ్రహాలకు అధినేత సూర్యుడు అధిపతి సింహరాశి. ఈ రాశికి చెందిన వ్యక్తులకు బృహస్పతి రోహిణి నక్షత్రంలో వక్ర గమనంతో శుభ ఫలితాలను తెస్తుంది. వివాహం ప్రయత్నాలు చేసే వారి ప్రయత్నాలు ఫలించి పెళ్లి పీఠలు ఎక్కే అవకాశాలున్నాయి. వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. శుభవార్త వింటారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులకు ఎంతగానో ఎదురు చూసే పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయి.ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న డబ్బు చేతికి అందే అవకాశాలున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత అవకాశాల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి.
ధనుస్సు రాశి: ఈ రాశిని పాలించే గ్రహం గురువు. కనుక ఈ రాశికి చెందిన వ్యక్తులకు బృహస్పతి అనుగ్రహం సొంతం అవుతుంది. అదృష్టం ఈ రాశికి చెందిన వ్యక్తుల సొంతం. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ఈ సమయం వీరికి సర్వత్రా అనుకూలంగా ఉంటుంది. కోర్టు పనుల్లో సక్సెస్ అందుకుంటారు. ఆస్తి కొనుగోలు చేయడానికి, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి శుభ సమయం. అంతేకాదు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి, లేదా కొత్త పనులు ప్రారంభించడానికి శుభతరుణం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు