Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
దిన ఫలాలు (అక్టోబర్ 12, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక విషయాల్లో ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. వృషభ రాశి వారికి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఆశలు వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. మిథున రాశి వారి నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఊపందుకుంటాయి.

దిన ఫలాలు (అక్టోబర్ 12, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక విషయాల్లో ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. వృషభ రాశి వారికి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఆశలు వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. మిథున రాశి వారి నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఊపందుకుంటాయి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
బాధ్యతల మార్పు వల్ల వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి బాగా తగ్గుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సవ్యంగా పూర్తవుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక విషయాల్లో ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు, ఆదరాభిమానాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఆశలు వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. గృహ, వాహనాల ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి వృద్ధి చెందుతుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో ఆటంకాలు, అవరోధాలు తొలగిపోతాయి. బంధు మిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. ఆదాయ వృద్ది ప్రయత్నాల్లో ఆత్మ విశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఊపందుకుంటాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. కుటుంబపరంగా అదనపు బాధ్యతలు పడే అవకాశం ఉంది. పిల్లల విద్య, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యక్తిగతంగా ఒకటి రెండు సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగ బాధ్యతల నిర్వహణ పట్ల అధికారులు సంతృప్తి చెందుతారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ, తిప్పట ఉంటాయి. ఆదాయం కలిసి వస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. బంధువులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ధనపరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. మిత్రులకు సహాయం చేస్తారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా నష్టాల నుంచి బయటపడతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. కొద్దిపాటి శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుని పొదుపు చర్యలు చేపట్టడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో అధికారుల నుంచి ఊహించని ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారులకు సరికొత్త అవకాశాలు అందుతాయి. అనుకున్న పనులు, వ్యవహారాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. బంధుమిత్రులతో శుభ కార్యాల్లో పాల్గొంటారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పరిచయస్థులలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఉద్యోగుల ప్రతిభకు, సమర్థతకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలను పొందుతారు. కుటుంబంతో కలిసి శుభకార్యానికి వెడతారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలను వ్యయ ప్రయాసలకోర్చి పూర్తి చేస్తారు. కుటుంబానికి సంబంధించిన పనుల మీదా, సొంత పనుల మీదా శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ సలహాలకు, సూచనలకు ప్రాధాన్యం పెరుగుతుంది. ముఖ్య మైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి అనుకోకుండా ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమవుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఉద్యోగులకు అధికారులు భారీ లక్ష్యాలను అప్పగించే అవకాశం ఉంది. సహోద్యోగుల సహాయంతో వాటిని పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా చాలావరకు అను కూల వాతావరణం ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. శక్తికి మించి ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగ జీవితంలో పనిభారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. అనుకున్న పనుల్ని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఇంతవరకూ వసూలు కాని బాకీలు ఇప్పుడు వసూలు అవుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో కొద్దిగా పని ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఎక్కువగా ఆధార పడతారు. బాధ్యతలను, లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అతి కష్టం మీద ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. కొందరు మిత్రుల వల్ల ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.



