Horoscope Today: వారికి ఉద్యోగ పదోన్నతులకు అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (July 24, 2025): మేష రాశి వారు ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృషభ రాశికి చెందిన ఉద్యోగుల మీద అధికారులకు నమ్మకం పెరుగుతుంది. మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. మిథున రాశి వారి ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (జూలై 24, 2025): మేష రాశి వారు ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృషభ రాశికి చెందిన ఉద్యోగుల మీద అధికారులకు నమ్మకం పెరిగే అవకాశముంది. మిథున రాశి వారి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు ఎంతో నమ్మకంతో బాధ్యతలు పెంచడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు కానీ, ఆర్థిక వ్యవహారాల్లో, ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగిపోతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. వృథా ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించుకోవలసి ఉంటుంది. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగుల మీద అధికారులకు నమ్మకం పెరుగుతుంది. మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. ఆదాయం నిలకడగా పెరుగుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. సామాజిక కార్యకలాపాలు పెరుగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు వైఖరి మంచిది కాదు. కొందరు మిత్రుల వల్ల ధన నష్టం జరగవచ్చు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు బాగా లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. రావలసిన సొమ్ము చేతికి అందడంతో పాటు మొండి బాకీలు వసూలు అవుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత బాగా పెరుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చకపోవడం శ్రేయస్కరం. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో కొద్దిపాటి విజయం లభించే అవకాశం ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో కొద్దిగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దూర ప్రయాణాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ప్రస్తుతానికి సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలను జాగ్రత్తగా చక్కబెట్టుకుంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో శ్రమ, ఒత్తిడి ఉన్నా సకాలంలో బాధ్యతలు, లక్ష్యాలు పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపడతారు. బంధువుల వ్యక్తిగత విషయాల్లో కల్పించుకోకపోవడం శ్రేయస్కరం. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ పరిచయాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. వృత్తి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధుమిత్రుల నుంచి రావలసిన డబ్బును రాబట్టుకుంటారు. పిత్రార్జితం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. కొద్దిగా పని ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మంచి ఫలితాలనిస్తాయి. బంధుమిత్రులతో సామరస్యం పెరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. అనవసర పరిచయాలకు, నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులకు అవకాశం ఉంది. అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందు తాయి. పరిచయస్థుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థికపరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొందరు మిత్రులను ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా మాత్రమే పెరిగే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. మిత్రుల వల్ల ధన నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. ఏ ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రా భరణాలు కొనుగోలు చేస్తారు. తోబుట్టువులతో కొద్దిగా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.



