Horoscope Today: వీరికి దైవబలం.. ఇష్టమైన వారితో సమయం గడుపుతారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

|

Sep 16, 2022 | 7:08 AM

Horoscope Today: ఈ రాశి వారు ఇష్టమైన వారితో కలసి కాలాన్ని గడుపుతారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు కలసి వస్తాయి. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లాభిస్తుంది.

Horoscope Today: వీరికి దైవబలం.. ఇష్టమైన వారితో సమయం గడుపుతారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
Horoscope Today
Follow us on

మేషం

ఉద్యోగం, వ్యాపారాది రంగాల్లో అనుకూలం. అనవసర ఖర్చులు వస్తాయి. ఇతరులతో అనవసర కలహాలు కలిగే అవకాశం. చేపట్టిన పనుల్లో విఘ్నాలు ఎదురవుతాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. నవగ్రహ ధ్యానం చేయడం వల్ల శుభం కలుగుతుంది.

వృషభం

ఇవి కూడా చదవండి

ఈ రాశి వారికి శుభ ఘడియలు నడుస్తున్నాయి. వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. విందులు, వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. పరమేశ్వరుడిని దర్శించుకుంటే మేలు జరుగుతుంది.

మిథునం

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. సమయస్ఫూర్తితో వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరం. లక్ష్మీస్తుతి జపించడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు.

కర్కాటకం

ఈ రాశి వారికి అనుకూల ఫలితాలున్నాయి. అయితే కీలక పనులు, వ్యవహారాలు ఆలస్యమవుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే శుభం చేకూరుతుంది. గోవులను పూజించడం వల్ల ఉత్తమ ఫలితాలు అందుకుంటారు.

సింహరాశి

వీరు దైవబలంతో పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు మంచి కాలం నడుస్తోంది. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఇష్టదైవారాధన మాత్రం మరవద్దు.

కన్య

చేపట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది. కుటుంబ బాధ్యతలు నెత్తిన పడతాయి. కీలక విషయాల్లో అంచనాలు తప్పుతాయి. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది.

తుల

అలసట పెరుగుతుంది. కొందరి ప్రవర్తనా తీరుతో ఇబ్బందులకు గురవుతారు. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే మేలైన ఫలితాలు అందుకుంటారు.

వృశ్చికం

ఈరాశి వారికి మంచి కాలం నడుస్తోంది. కీలక విషయాల్లో సానుకూల ఫలితాలు అందుకుంటారు. మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆంజనేయస్వామిని దర్శించుకోవడం వల్ల మేలు కలుగుతుంది.

ధనస్సు

వీరు ఇష్టమైన వారితో కలసి కాలాన్ని గడుపుతారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు కలసి వస్తాయి. కీలక విషయాల్లో
కుటుంబ సభ్యుల సహకారం లాభిస్తుంది. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శుభం కలుగుతుంది.

మకరం

చేపట్టిన రంగాల్లో శ్రమాధిక్యం తప్పదు. అనవసర ఆలోచనలను దరిచేరనీయకపోవడం ఉత్తమం. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కీలక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికి రావు. విష్ణు స్వామిని దర్శించుకుంటే మేలు చేకూరుతుంది.

కుంభం

చేపట్టిన కార్యాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసంతో అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన మనసుకు బాధ కలిగిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. గోసేవ చేస్తే శుభం కలుగుతుంది.

మీనం

వృత్తి, ఉద్యోగ, వ్యాపార తదితర రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. సమయస్ఫూర్తితో ముందుకు సాగుతారు. ప్రసన్నాంజనేయ స్వామి స్తోత్ర పారాయణం చేస్తే మరీ మంచిది.

NOTE: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.