AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు వీరికి అదృష్టం వెన్నంటే ఉంటుంది.. శనివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope Today: ఈ రాశి వారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది. అధికారులు సహకారం లాభిస్తుంది. కీలక వ్యవహారాలు, పనుల్లో ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు.

Horoscope Today: ఈరోజు వీరికి అదృష్టం వెన్నంటే ఉంటుంది.. శనివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
Horoscope Today
Basha Shek
|

Updated on: Sep 17, 2022 | 6:19 AM

Share

మేషం చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యం తప్పదు. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. సమస్యల పరిష్కారానికి శ్రీరామ రక్షా స్తోత్రం పఠిస్తే మంచిది.

వృషభం సమయస్ఫూర్తితో అనుకున్న ఫలితాలను సాధిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సమాజంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. లక్ష్మీదేవిని పూజిస్తే మేలు చేకూరుతుంది.

మిథునం కీలక వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇష్టదేవతారాధన మాత్రం మానవద్దు.

ఇవి కూడా చదవండి

కర్కాటకం ఆయా రంగాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. స్నేహితులు, సన్నిహితుల వల్ల మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే శుభం కలుగుతుంది.

సింహం కీలక విషయాల్లో బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని పెంచుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఇష్ట దైవారాదన మాత్రం మానవద్దు.

కన్య అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. మనసుకు ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో సహకారం అందుతుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

తుల శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. సన్నిహితుల సహకారంతో అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు.

వృశ్చికం వీరికి అదృష్టం వెన్నంటే ఉంటుంది. అధికారులు సహకారం లాభిస్తుంది. కీలక వ్యవహారాలు, పనుల్లో ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మేలు కలుగుతుంది

ధనస్సు కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సహకారం అందుతుంది. నిర్ణయాలు అనుకూలంగా వస్తాయి. సర్దుకుపోయే మనస్తత్వం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దుర్గా దేవిని పూజించడం వల్ల శుభం కలుగుతుంది.

మకరం కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం. ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. లక్ష్మీగణపతి ధ్యానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారు.

కుంభం సమయస్ఫూర్తితో మంచి ఫలితాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబీకులు, బంధువులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. నవగ్రహ శ్లోకం పఠిస్తే మంచిది.

మీనం చిత్తశుద్ధితో పనిచేస్తారు. కీలక పనులు, వ్యవహారాల్లో సానకూల ఫలితాలు పొందుతారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే మేలు చేకూరుతుంది.

NOTE: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా