Horoscope Today: ఆదివారం రాశిఫలాలు.. నేడు ఈ రాశి ఉద్యోగస్తులు శుభవార్త వినే అవకాశం ఉంది..

|

Jul 17, 2022 | 6:37 AM

ఈరోజు (జూలై  17 వతేదీ) ఆదివారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

Horoscope Today: ఆదివారం రాశిఫలాలు.. నేడు ఈ రాశి ఉద్యోగస్తులు శుభవార్త వినే అవకాశం ఉంది..
Horoscope Today
Follow us on

Horoscope Today (17-07-2022): రోజులో ఏ పనిమొదలు పెట్టాలన్నా.. ఎక్కడికి వెళ్లాలన్నా ఈ రోజు తమకు ఎలా ఉంటుందని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాలను ( Daily Horoscope) తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూలై  17 వతేదీ) ఆదివారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి విజయాన్ని సొంతం చేసుకుంటారు. ముఖ్యవిషయాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది.. అప్రమత్తత అవసరం.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వారికీ అనుకూల ఫలితాలను ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు బంధుమిత్రులతో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకండి.. ప్రశాంతమైన ఆలోచనలతో ముందుకు సాగితే సంతోషంగా గడుపుతారు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఆయా రంగాల్లో చేపట్టిన పనులను ఆత్మవిశ్వాసంతో చేయాల్సి ఉంటుంది. కొన్ని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో శుభ ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగులకు స్దాన చలనం కలుగుతుంది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపై విజయాన్ని సొంతం చేసుకుంటారు. మానసికంగా ఇబ్బందులు పడకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశి వారు అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. స్థిరమైన నిర్ణయాలతో అభివృద్ధిని సాధిస్తారు. ఇతరులను కలుపుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు అధికంగా శారీరక శ్రమ పడాల్సి ఉంటుంది. కొన్ని సంఘటనలకు దూరంగా ఉండడం మేలు. బంధు, మిత్రులతో విబేధాలు ఏర్పడే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో విజయావకాశాలున్నాయి.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. కీలక వ్యవహారంలో ఆలోచించి అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు కలగకుండా ముందుచూపుతో వ్యవహరించాల్సి ఉంటుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. అనవసర ధనవ్యయం చేయాల్సి ఉంటుంది.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలోని వారికి అనుకూల సమయం. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. పనితీరుతో ప్రశంసలను అందుకుంటారు.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యులతో కలహాలకు దూరంగా ఉండడం మేలు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)