Horoscope Today (12-07-2022): రోజులో ఏ పనిమొదలు పెట్టాలన్నా.. ఎక్కడికి వెళ్లాలన్నా ఈరోజు జాతకం ఎలా ఉంది అని తెలుసుకోవాలని చాలా మంది భావిస్తారు. మంచి చెడుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో తమ దినఫలాలు ( Daily Horoscope)పై ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూలై 12వతేదీ) మంగళవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేష రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు ఆత్మవిస్వసంతో పూర్తి చేస్తారు. మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలోని వారికి శుభ ఫలితాలు ఉంటాయి. చంచలబుద్ధితో ఇబ్బందను ఎదుర్కొంటారు.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రారంభించనున్న పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి మొదలు పెట్టె ప్రయత్నం చేస్తారు. కీలక వ్యవహారాలను వాయిదావేసుకోవడం మంచిది. అప్రమత్తంగా ఉండడం మేలు. వృత్తి, ఉద్యోగస్తులు అధికంగా శ్రమపడాల్సి ఉంటుంది.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు.అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకోవాల్సి ఉంటుంది.
కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కుటుంబంలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి మిశ్రమ కాలం. అనవసర విషయాలకు దూరంగా ఉండడం మేలు. చేపట్టిన పనులను జరిపే విషయంలో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్నేహితులు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంది.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్తగా చేపట్టిన పనులు ప్రారంభిస్తారు. శుభకాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు శుభ ఫలితాలను అందుకుంటారు.
తుల రాశి: ఈ రోజు ఈ రాశి కుటుంబం సభ్యులకు సంబంధించిన శుభవార్త వింటారు. ఇతరులను కలుపుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండే విధంగా నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది.
వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు ముఖ్యమైన విషయంలో అధికారులను కలుస్తారు. ఫలితాలను అనుకూలంగా ఉంటాయి. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆయా రంగాల్లో శుభకాలం.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. కీలక వ్యవహారంలో ఆలోచించి అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యులతో సంతోషముగా గడుపుతారు. చేపట్టిన పనులను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు మానసికఉత్సహంగా ఉంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అధిక శ్రమ పెరగకుండా చూసుకోవాల్సి ఉంది. ఇతరులతో రోజంతా సంతోషంగా గడుపుతారు.
మీన రాశి: ఈరోజు ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారికీ అనుకూల వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో విందు, వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సొంతం చేసుకుంటారు. విశేషమైన శుభయోగాలు ఉన్నాయి
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)