Horoscope Today: ఆ రాశుల వారికి ఆర్థికపరంగా అదృష్టం కలిసొస్తుంది.. గురువారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

ఆదాయానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు సానుకూలంగా ఫలిస్తాయి. కొన్ని ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. వ్యాపారంలో ఒక మెట్టు పైకి ఎదిగే అవకాశం ఉంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.

Horoscope Today: ఆ రాశుల వారికి ఆర్థికపరంగా అదృష్టం కలిసొస్తుంది..  గురువారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Mar 23, 2023 | 6:42 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి వ్యాపారాలు ప్రశాంతంగా సాగిపోతాయి. సంపాదన పెరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఎవరినైనా గుడ్డిగా నమ్మటం మంచిది కాదు. మోసపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ జీవితం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

కుటుంబ పరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. తోబుట్టువులతో సయోధ్య ఏర్పడుతుంది. ప్రస్తుతానికి వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం అంత మంచిది కాదు. కుటుంబ సమస్య ఒకటి చక్కబడు తుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఇబ్బందికరంగా మారుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో మీ ప్రతిభకు, మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయపరంగా, సంపాదనపరంగా మరో అడుగు ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇతరులకు ఆర్థికంగా సహాయపడతారు. కొత్త ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ జీవితం రొటీన్ గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆర్థికంగా ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుకుంటారు. ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీ నుంచి ఆఫర్ వస్తుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ జీవితం ఆనందంగా ముందుకు వెళుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆర్థిక ప్రయత్నాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. ఒక ముఖ్యమైన సమస్యను కుటుంబ సభ్యుల సహాయంతో పరిష్కరించు కుంటారు. ఆర్థిక విషయాల్లో బంధువులకు లేదా మిత్రులకు వాగ్దానం చేయకపోవడం మంచిది. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా ఉంటుంది. అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహంగా సాగుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు. సంపాదన ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ఉద్యోగ పరంగా కూడా పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగరీత్యా ప్రయాణం చేయాల్సి వస్తుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబంలో అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి వ్యాపారాల్లో మీ ఆలోచనలు సత్ఫలితా లను ఇస్తాయి. సంపాదన, లాభాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగు లకు విదేశాల నుంచి తీపి కబురు అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు బాగానే చక్కబడతాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ జీవితంలో చాలావరకు ముందుకు వెళతారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఒకటి రెండు ఆర్థిక సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. అదనపు ఆదాయం కోసం ప్రయ త్నాలు ప్రారంభిస్తారు. అయితే, ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. విద్యా ర్థులు గట్టి ప్రయత్నం మీద విజయం సాధిస్తారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా అపార్ధాలు తలెత్తుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో మంచి ప్రమోషన్ అందే సూచనలు ఉన్నాయి. బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు శుభవార్త వినడం జరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకు వెళతారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

అదృష్టం తలుపు తట్టే అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా కుటుంబ పరంగా కూడా కొన్ని కీలక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఇతరులకు వాగ్దానాలు చేయటం ద్వారా కొద్దిగా ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆదాయానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు సానుకూలంగా ఫలిస్తాయి. కొన్ని ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. వ్యాపారంలో ఒక మెట్టు పైకి ఎదిగే అవకాశం ఉంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ జీవితం అనుకూలంగా సాగిపోతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

జీవిత భాగస్వామితో సంప్రదించి కుటుంబ సంబంధమైన నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఆస్తి వ్యవహారం ఒకటి బంధువుల సహాయంతో పరిష్కారం అవుతుంది. ఆర్థిక సంబంధమైన ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ఒక ముఖ్యమైన సహాయ కార్యక్రమంలో పాల్గొంటారు. పిల్లలలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది.

మరిన్ని రాశి ఫలాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?