Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు కూడా మంచి ఆపర్లు..12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (December 12, 2025): మేష రాశి వారికి రాబడి బాగా వృద్ది చెందుతుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగి విశ్రాంతి ఉండకపోవచ్చు. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆర్థికపరంగా ముందుకు దూసుకుపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు కూడా మంచి ఆపర్లు..12 రాశుల వారికి రాశిఫలాలు
Rashi Phalalu 12 December 2025

Edited By: Janardhan Veluru

Updated on: Dec 12, 2025 | 5:31 AM

దిన ఫలాలు (డిసెంబర్ 12, 2025): మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ప్రోత్సాహం, ఆదరణ పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తులవారికి రాబడి బాగా వృద్ది చెందుతుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. వ్యాపారాల్లో రాబడి పెరిగి, విస్తరణ గురించి ఆలోచిస్తారు. నిరుద్యోగులకు స్వదేశంతో పాటు ఇతర దేశాల నుంచి కూడా ఆఫర్లు అందే సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి భారీగా షాపింగ్ చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగిన కారణంగా విశ్రాంతి ఉండకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో కూడా బాగా బిజీ అయిపోయే అవకాశం ఉంది. అవసరానికి మించి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. డబ్బు ఇవ్వాల్సినవారు తీసుకు వచ్చి ఇస్తారు. జీవిత భాగస్వామి సహకారంతో వ్యక్తి గత, కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఆరోగ్యానికి సమస్యేమీ ఉండదు. సొంత ఇంటికి ప్రయత్నాలు చేస్తారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. మిత్రుల వల్ల ఇబ్బందులుంటాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆర్థికపరంగా ముందుకు దూసుకుపోతాయి. కొద్దిపాటి ప్రయత్నంతో పనులు, వ్యవహారాలన్నీ సానుకూలపడతాయి. గ్రహాలు అనుకూలంగా ఉన్నందు వల్ల ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఏ రంగానికి చెందిన వారైనా పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆర్థికపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగినా ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తిపరంగా బాగా పురోగతి చెందడం జరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా నిలకడగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. ఆదాయానికి లోటుండదు. వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బాగానే ఉంటుంది కానీ, మానసికంగా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. బంధువుల రాకపోకలుంటాయి. ఒక శుభ కార్యం గురించి ప్లాన్ చేస్తారు. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఎదురుచూస్తున్న శుభవార్త అందుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగంలో భారీ లక్ష్యాలను కూడా సకాలంలో పూర్తి చేస్తారు. మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు అంచనాలకు మించి లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పిల్లల చదువులు సంతృప్తి కలిగిస్తాయి. కుటుంబంతో దైవ కార్యాల్లో పాల్గొంటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలతో పాటు హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు కూడా కొత్త పుంతలు తొక్కుతాయి. కొద్దిగా కూడా విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు. ఇంటికి దూరపు బంధువుల రాకపోకలుంటాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయానికి లోటుండదు. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. సానుకూల మార్పులు చోటు చేసుకునే సూచనలు కూడా ఉన్నాయి. సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. మరింత మెరుగైన ఉద్యోగంలోకి మారడానికి ప్రయత్నాలు సాగిస్తారు. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సొంత వ్యవహారాలు, పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఆదాయం బాగా వృద్ది చెందే అవకాశం ఉంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక విషయాలు చాలావరకు సంతృప్తికరంగా గడిచిపోతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. పిత్రార్జితం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులు మీ సమర్థతను గుర్తించి ప్రత్యేక బాధ్యతలతో ప్రోత్సహించే అవకాశం కూడా ఉంది. వృత్తి జీవితంలో కార్యకలాపాలు పెరుగుతాయి. వ్యాపారాలను విస్తరించే సూచనలున్నాయి. ఆదాయానికి లోటుండదు. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో సంతోష దాయక వాతావరణం నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మిత్రుల వల్ల డబ్బు నష్టపోతారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగంలో పని భారం పెరిగినా ఫలితం ఉంటుంది. వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పిల్లల నుంచి చదువుల విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వ్యక్తిగత కార్యకలాపాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులు వేగంగా పూర్తవుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగులకు కూడా మంచి ఆపర్లు అందుతాయి. శత్రువులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.