AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today : ఈ రాశివారు ఈరోజు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today  8th march 2021 :  ఇప్పటికీ రాశి ఫలాలను విశ్వసించి.. తమ రోజును ప్రారంభించేవారు చాలా మందే ఉన్నారు. ఈరోజున ఏం జరగబోతుందనేది

Horoscope Today : ఈ రాశివారు ఈరోజు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Rajitha Chanti
|

Updated on: Mar 09, 2021 | 9:36 AM

Share

Horoscope Today  8th march 2021 :  ఇప్పటికీ రాశి ఫలాలను విశ్వసించి.. తమ రోజును ప్రారంభించేవారు చాలా మందే ఉన్నారు. ఈరోజున ఏం జరగబోతుందనేది ముందుగానే తెలుసుకోవాలని కోరుకుంటుంటారు. అందుకోసం రాశిఫలాలను నమ్ముతుంటారు. ఈరోజు మార్చి 8 సోమవారం చంద్రుడు ధనస్సు రాశిలో ఉండనున్నాడు. అలాగే ఈరోజు మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషరాశి..

ఈరోజు మీరు దాదాపుగా అప్పులు చేసే పనులకు దూరంగా ఉండడం మంచిది. అలాగే అనుకొని నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఈరోజు మీరు విష్ణు సహస్త్ర నామా స్త్రోత్ర పరాయణం చేయడం మంచి చేస్తుంది.

వృషభ రాశి..

ఈరోజు మీరు ఎక్కువగా శ్రమకు గురయ్యే సందర్బాలు కనిపిస్తున్నాయి. అలాగే చేపట్టినటువంటి పనులు కొన్ని ఆలస్యంగా పూర్తిచేస్తుంటారు. లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి..

ఈరోజు మీరు చేపట్టినటువంటి పనులు మరింత అధికమయ్యే అవకాశాలున్నాయి. అలాగే విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు కలిసివచ్చే సూచనలు ఉన్నాయి. ఇక ఈరోజు మీరు సుబ్రమణ్య స్వామి స్త్రోత్ర పరాయణం చేయడం వలన మంచి కలుగుతుంది.

కర్కాటక రాశి..

ఈరోజు మీరు ప్రయాణ పరంగా జాగ్రత్తలు తీసుకుంటుండాలి. ఆద్యాత్మిక, దైవ చింతన కార్యాక్రమాల్లో పాల్గోంటుంటారు. పార్వతీ పరమేశ్వరుల అర్చన, దర్శనం మేలు చేస్తుంది.

సింహరాశి..

ఈరోజు ఈరు సంఘంలో గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని నూతనమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గోంటుంటారు. విశేషమైనటువంటి జాజి పుష్పాలతో పరమేశ్వరుని ఆరాధన మేలు కలుగుతుంది.

కన్యరాశి..

ఈ రోజు మీకు బాధ్యతలు పెరుగుతుంటాయి. కొన్ని రకాల నూతనమైనటువంటి పనులు చేపట్టడంలో పెద్దవారి సహయం అవసరమవుతాయి. అలాగే శ్రీసుక్తా పరాయణం చేయడం మంచిది.

తులరాశి..

ఈరోజు మీరు కొద్దిగా ఆర్థికంగా లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. రావాల్సినటువంటి బాకీలు ఆలస్యమవుతుంటాయి. విష్ణు సంబంధమైన ఆరాధన మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి..

స్థాన చలన మార్పులు కనిపిస్తున్నాయి. చేపట్టినటువంటి పనులలో ఏమాత్రం తొందరపడకూడదు. విశేషమైనటువంటి లలిత సహస్త్ర నామా స్త్రోత్రం మేలు చేస్తుంది.

ధనస్సు రాశి..

ఈరోజు మీకు శ్రమకు తగినటువంటి ఫలితాలు లభించే అవకాశాలున్నాయి. ప్రయోజనాలను అందుకోవడంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. దుర్గా సప్త శ్లోక పరాయణం మేలు చేస్తుంది.

మకర రాశి..

ఈరోజు మీరు దాచిపెట్టినట్టువంటి వ్యవహరిక విషయాలు కొంత ఇబ్బందిని కలుగజేస్తాయి. ఆదాయ మార్గాల్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. గురువుల దర్శనం మేలు చేస్తుంది.

కుంభ రాశి..

ఈరోజు మీరు ఆద్యాత్మిక , దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గోనే సూచనలున్నాయి. అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో గౌరవం కోల్పోకుండా చూసుకోవాలి. శ్రీరాముని నామా స్మరణ మేలు చేస్తుంది.

మీన రాశి..

ఈరోజు మీకు పెట్టుబడుల విషయంలో అనుకూల, ప్రతికూలమైనటువంటి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దూరప్రాంతాలలో ఉన్నటువంటి ముఖ్యులను కలుసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. ఐశ్వర్య లక్ష్మీ ఉపాసన మేలు చేస్తుంది.

Also Read: