Horoscope Today: ఆ రాశి నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి.. 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Dec 30, 2023 | 5:01 AM

దిన ఫలాలు (డిసెంబర్ 30, 2023): మేష రాశి వారికి వృథా ఖర్చులు బాగా తగ్గించుకోవడం మంచిది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. మిథున రాశి వారు కొద్దిపాటి వ్యయప్రయాసలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి.. 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు
Horoscope Today 30th December 2023
Follow us on

దిన ఫలాలు (డిసెంబర్ 30, 2023): మేష రాశి వారికి వృథా ఖర్చులు బాగా తగ్గించుకోవడం మంచిది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. మిథున రాశి వారు కొద్దిపాటి వ్యయప్రయాసలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

దైవ దర్శనాలు చేసుకుంటారు. వృథా ఖర్చులు బాగా తగ్గించుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ప్రాభవం పెరుగుతుంది. కుటుంబ పెద్దల్లో ఒకరికి అనారోగ్యం తప్పకపోవచ్చు. కుటుంబసమేతంగా విహార యాత్ర చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. కుటుంబ జీవితం చాలా వరకు సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూల పడతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

పిల్లలకు సంబంధించిన ఆశించిన శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపో తాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతల వల్ల శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

కొద్దిపాటి వ్యయప్రయాసలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. అవసరానికి ధనం చేతికి అందుతుంది. ధన సంబంధమైన వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో సొంత నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొందరు సన్నిహితులు ఆర్థికంగా నష్టం కలిగిస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం ఉంది. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు ఆశించిన విధంగా లాభసాటిగా సాగిపోతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సతీమణికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లకు బాగా డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలలో కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఎక్కువగా ఆధ్మాత్మిక చింతనలో కాలం గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో చిన్నా చితకా సమ స్యలు తొలగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడానికి బాగా ఖర్చు చేయాల్సి వస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు విస్తరి స్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఆర్థిక నిర్వహణ బాధ్యతలను కుటుంబ సభ్యులకు అప్పగించడం మంచిది. మితిమీరిన ఔదార్యం వల్ల బాగా నష్టపోతారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. విలువైన వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రయాణాలలో, ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

విద్యార్థులు చదువుల్లోనే కాక, పోటీ పరీక్షల్లోనూ రికార్డులు సృష్టిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజా వుగా సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. ఉద్యోగంలో పదోన్నతు లకు అవకాశం ఉంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబసమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. దైవ కార్యాల మీద బాగా ఖర్చు చేస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కుటుంబంలో ఒత్తిళ్లు పెరుగుతాయి. ముఖ్య మైన పనుల్లో శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు పరవాలేదనిపిస్తాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి అనుకోకుండా విముక్తి లభిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లలకు చదువుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రోజంతా ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. వృత్తి రంగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రస్తుతానికి ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వకపోవడం మంచిది. కొత్త ప్రయత్నాలు చాలావరకు సత్ఫలితాలనిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ముఖ్యమైన పనులు, వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి సంబంధం విషయంలో బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా, ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల మీద దృష్టి పెడతారు. ప్రయాణాలు, ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. అనవసర ఖర్చులకు కళ్లెం వేయాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

కీలక సమయంలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అధికారాలను పంచుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. పిల్లల విషయంలో శుభవార్తలు అందుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరంగా వాగ్దానాలు చేయకపోవడం, హామీలు ఉండకపోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగాలలో అధికారులతో సామరస్యం నెలకొంటుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. రాజకీయ వర్గాల వారితో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లలు ఆశించినంతగా వృద్ధిలోకి వస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.