AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వీరు సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు చేపట్టాలన్నా కొందరు తమ జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అంతెందుకు రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా..

Horoscope Today: వీరు సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Basha Shek
|

Updated on: Apr 30, 2022 | 6:31 AM

Share

Horoscope Today: కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు చేపట్టాలన్నా కొందరు తమ జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అంతెందుకు రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ క్రమంలో మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారికి ఏప్రిల్‌ 30వ తేదీ శనివారం రాశి ఫలాలు(Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

మేషం

ప్రారంభించిన పనుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. ఆయా రంగాల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. కీలక పనులను చక్కదిద్దుకుంటారు. ముఖ్యమైన పనులకు సంబంధించి పెద్దల సూచనలు పాటించడం మంచిది. ఇష్టదేవతలను ఆరాధిస్తే మంచి కలుగుతుంది.

వృషభం

శ్రమాధిక్యం పెరగకుండా చూసుకోవాలి. సన్నిహితులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. అపోహలతో అయినవారిని దూరం చేసుకోకండి. శ్రీరాముడిని పూజిస్తే శుభం కలుగుతుంది.

మిథునం

ముఖ్యమైన పనుల్లో సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రశంసలు అందుకుంటారు. సంతానానికి సంబంధించి ఒక శుభవార్త వింటారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం పఠిస్తే మేలు చేకూరుతుంది.

కర్కాటకం

ఆటంకాలు ఎదురైనా అనుకున్న పనుల్లో సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. బంధుమిత్రులు, స్నేహితుల సహకారం లభిస్తుంది.  నవగ్రహ స్తోత్రం చదివితే సానుకూల ఫలితాలు అందుకుంటారు.

సింహం

దైవానుగ్రహం ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొంటారు. కీలక విషయాల్లో పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సానుకూల ఫలితాలు అందుకుంటారు.

కన్య చేపట్టిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి. అయినా మనోధైర్యంతో ముందుకెళతారు. ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. కొన్ని వ్యవహారాలలో తెలివిగా వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ చేయడం వల్ల అనుకూల ఫలితాలు సాధిస్తారు.

తుల

ఈరాశివారికి గ్రహబలం బాగుంది. ఆయా రంగాల్లో విజయవంతంగా ముందుకు పోతారు. ఇతరులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే మేలు చేకూరుతుంది.

వృశ్చికం

వీరికి ఉన్నతమైన ఆలోచనలనుంటాయి. ఆయా రంగాల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం వల్ల శుభం కలుగుతుంది.

ధనుస్సు

కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి, ఆందోళన పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులు, స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే మేలు చేకూరుతుంది.

మకరం

పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన రంగాల్లో సానుకూల ఫలితాలు సాధిస్తారు. ఏ పని తలపెట్టినా ఇట్టే పూర్తి చేస్తారు. స్నేహితుల సహకారం అందుకుతంది. ఇష్ట దైవతలను ఆరాధించడం మంచిది.

కుంభం

ఈ రాశుల వారికి గ్రహబలం బాగుంది. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధు,మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఇష్టదేవతలను పూజిస్తే సానుకూల ఫలితాలు పొందుతారు.

మీనం

ఆలోచనల్లో స్థిరత్వం పాటించాలి. ఉద్యోగంలో ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో పెద్దలు, అనుభవజ్ఞుల సలహాలు అవసరమవుతాయి. శివారాధన వల్ల శుభం చేకూరుతుంది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఇవ్వడం జరిగింది.)

Also Read:

Health Tips: ఇలాంటి పనులు చేస్తున్నారా.. అయితే, మెదడు ప్రమాదంలో పడ్డట్లే..

Watch Video: అంపైర్ నాటౌట్ ఇచ్చినా.. మైదానం వీడిన డికాక్.. ఎందుకో తెలుసా? వైరల్ వీడియో..

Gold Silver Price Today: మహిళలకు షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు

Follow Us
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..