Horoscope Today(28 June): ఆ రాశి నిరుద్యోగులు శుభవార్త వింటారు.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు..

Horoscope Today (28 June 2023): భవిష్యత్తులో తమ జీవితంలో ఏం జరగబోతోందో.. ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దీని కోసం ప్రపంచ వ్యాప్తంగా జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరిస్తారు. ఇవాళ ఆయా రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి? 12 రాశుల వారి బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Horoscope Today(28 June): ఆ రాశి నిరుద్యోగులు శుభవార్త వింటారు.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు..
Horoscope 28th June 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jun 28, 2023 | 6:25 AM

Horoscope Today (28 June 2023): భవిష్యత్తులో తమ జీవితంలో ఏం జరగబోతోందో.. ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దీని కోసం ప్రపంచ వ్యాప్తంగా జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరిస్తారు. ఇవాళ ఆయా రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి? 12 రాశుల వారి బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1):

కుటుంబ పరంగా రోజంతా ఉత్సాహంగా సాగిపోతుంది. ఉద్యోగ జీవితంలో పని భారం బాగా పెరుగుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. దాంతో పాటు ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఎవరికీ హామీలు ఉండటం, వాగ్దానాలు చేయడం మంచిది కాదు. ఆశించిన శుభవార్త వింటారు.

ఇవి కూడా చదవండి

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2):

ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా గడిచిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. దైవ కార్యాలలో పాల్గొంటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3):

ఉద్యోగంలో ప్రమోషన్ లేదా అధికారానికి అవ కాశం ఉంది. ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపు తారు. ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక పనులు పూర్తి అవుతాయి. కుటుంబ సమస్యలతో డీల్ చేయడంలో ఆచి తూచి అడుగు వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష):

కొన్ని ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. బంధువుల సహాయంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లల నుంచి లేదా జీవిత భాగస్వామి నుంచి శుభవార్త వింటారు. రోజంతా ప్రశాంతంగా, ఆనందంగా గడిచి పోతుంది. ముఖ్యమైన ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. డబ్బు జాగ్రత్త.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1):

ఉద్యోగానికి సంబంధించి మంచి కబురు అందు తుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులు వృద్ధిలోకి వస్తారు. వృత్తి జీవితం బిజీగా ఉండే అవకాశం ఉంది. బంధువులతో అపార్ధాలు చోటు చేసుకుంటాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2):

కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. అవసరాలకు తగ్గట్టుగా డబ్బు అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. పెట్టుబడుల మీద ఆశించిన ప్రతిఫలం అందు తుంది. ఉద్యోగంలో సకాలంలో లక్ష్యాలను పూర్తి చేస్తారు. రోజంతా సంతృప్తికరంగా సాగిపో తుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3):

ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఊపు అందుకుంటాయి. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత, కుటుంబ సమస్యలు దూరం అవుతాయి. ఆదాయం పెరగడానికి చేస్తున్న ప్రయత్నాలు ఆశించినంతగా సఫలం అవుతాయి. ఆరోగ్యం చాలా వరకు అను కూలంగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో ముఖ్య మైన పనులు పూర్తి అవుతాయి. శుభ వార్తలకు అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ):

కొద్దిగా డబ్బుకు కటకట ఏర్పడుతుంది. డబ్బు ఇవ్వాల్సినవారు ఇవ్వక పోవచ్చు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. డాక్టర్లకు, లాయర్లకు సంపాదన పెరుగుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన సానుకూల పడక పోవచ్చు. ఆర్థిక లావాదేవీలతో జాగ్రత్త.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1):

ముఖ్యమైన విషయాలలో సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం అయినా సఫలం అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆహార నియమాలు పాటించడం మంచిది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. శుభ వార్త వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2):

స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలం కావచ్చు. ఉద్యోగంలో కొద్దిగా పని భారం పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నం ఒకటి సానుకూల పడుతుంది. తోబుట్టువులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు. ఆర్థిక సహాయం విషయంలో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3):

కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. జీవిత భాగస్వామి తరఫు నుంచి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్యం పరవా లేదు. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి):

చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక ముఖ్య మైన కుటుంబ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. వృత్తి నిపుణులకు అవ కాశాలు పెరుగుతాయి. స్వయం ఉపాధి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలలో సఫలం అవుతారు.

నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..