Horoscope Today (24th July): భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు విశ్వసిస్తారు. గ్రహాలు, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని ఒకరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందని లెక్కిస్తారు జ్యోతిష్య పండితులు. మరి 12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో ఎక్కువ భాగం చక్కబడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితాలుంటాయి. ఉద్యోగంలో మీ కృషికి, మీ నిబద్ధతకు గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకా రాలు ఆనందం కలిగిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర రంగాలవారికి సంపాదన పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల శ్రమ, ఒత్తిడి పెరిగే సూచనలున్నాయి. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచడం మంచిది. ఆదాయం పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహాన్ని నింపుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లలు చదువుల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగంలో కూడా కొత్త ప్రాజెక్టులు చేతికి వచ్చే అవకాశం ఉంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఒకటి రెండు కుటుంబ సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆర్థిక విషయాల్లో స్నేహితులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలను పూర్తి చేయడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో శ్రమ మిగులుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): నూతన వస్తు వాహనాల కొనుగోలుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా లాభాలు అందుతాయి. వ్యవహార జయానికి, కార్యసిద్ధికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్త అందుకుంటారు.
కన్య ( ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): కుటుంబ సమస్యల పరిష్కారంలో గానీ, ఇతరత్రా కుటుంబ వ్యవహారాలలో కానీ ఏకపక్షంగా వ్యవ హరించడం మంచిది కాదు. జీవిత భాగస్వామితో కూడా సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చేపట్టిన వ్యవహారాలు త్వరితగతిన పూర్తవుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెంచడా నికి ఇది సమయం కాదు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో బరువు బాధ్యతలు పెరుగుతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వృత్తి, ఉద్యోగాలలోనే కాకుండా సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సోదర వర్గంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇత రుల నుంచి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి, కొత్త అవకాశాలు అందివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలిస్తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఆదాయం, ఆరోగ్య పరిస్థితులు స్థిరంగా ముందుకు సాగుతాయి. సమయానికి చేతికి డబ్బు అంది రుణ సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కొత్త వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థ వంతంగా నిర్వహించి అధికారులు మెప్పు పొందుతారు. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): సోదర వర్గంతో స్థిరాస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు. కొన్ని వ్యక్తిగత వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో గానీ పూర్తి కావు. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందోత్సాహాలతో సాగిపోతుంది. ప్రయాణాలు లాభిస్తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. అధికారులకు మీ సలహాలు ఉపయోగపడతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఒకటి రెండు సమస్యలున్నా అవి నిదానంగా సర్దుకుంటాయి. చేపట్టిన ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. చిన్న నాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. కొందరు స్నేహితుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, అనుకోని ఖర్చుల్ని భరించాల్సి వస్తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాజకీయాలు, రియల్ ఎస్టేట్, లిక్కర్ వంటి రంగాలకు చెందినవారికి ఆర్థిక ప్రయోజనాలు అందివస్తాయి. అన్ని రంగాలకు చెందినవారికి సమయం కాస్తంత అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహంగా పనిచేసి శుభ ఫలితాలను పొందడం జరుగుతుంది. ఒక శుభకార్యానికి ప్లాన్ చేస్తారు. బంధువులను కలుసుకుంటారు. కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేయడం జరుగుతుంది.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.