AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వీరు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమ రాశి ఫలాలు(Rasi Phalalu) ఎలా ఉన్నాయో చూసుకుంటారు. వాటి ఆధారంగానే నిర్ణయాలు కూడా తీసుకుంటుంటారు

Horoscope Today: వీరు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Basha Shek
|

Updated on: Apr 21, 2022 | 5:49 AM

Share

Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమ రాశి ఫలాలు(Rasi Phalalu) ఎలా ఉన్నాయో చూసుకుంటారు. వాటి ఆధారంగానే నిర్ణయాలు కూడా తీసుకుంటుంటారు. ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.. ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు వెళుతుంటారు. మరి గురువారం (ఏప్రిల్‌ 21) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

మేషం

ప్రారంభించబోయే పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. ఎవరితోనూ అతిచనువుగా ఉండొద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ పాటించాలి. దుర్గాదేవిని పూజిస్తే మంచి ఫలితాలు అందుకుంటారు.

వృషభం

ఈ రాశివారు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. అయితే శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. కుటుంబీకులు, బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ వ్యవహారాల్లో మరింత ఓపికగా ఉండడం మంచిది. విష్ణు, సూర్య దేవుళ్లను ఆరాధిస్తే శుభం కలుగుతుంది.

మిథునం

వీరికి శుభ ఘడియలు నడుస్తున్నాయి. సమయస్ఫూర్తితో సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఇష్టదేవతలను పూజించడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు.

కర్కాటకం

శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తిగతంగా, వ్యక్తిగతంగా కొన్ని కీలక పనులు పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబీకులు, బంధువుల, స్నేహితుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది.

సింహం

వీరికి మంచి కాలం నడుస్తోంది. ఒక శుభవార్త కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగం తదితర విషయాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉన్నతాధికారుల ప్రశంసలను అందుకుంటారు.

కన్య

ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మనోధైర్యాన్ని వీడకూడదు. ఒక ముఖ్య వ్యవహారం విషయమై పెద్దలను బంధు,మిత్రులను కలుస్తారు. ఫలితం అనుకూలంగా లేకపోయినా నిరుత్సాహపడకూడదు. ధైర్యంగా ముందుకెళ్లాలి.

తుల

అభివృద్ధికి సంబంధించిన వార్తలు వింటారు. ప్రారంభించిన పనులను సమయానికి పూర్తిచేయగలుగుతారు. కొన్ని కీలక బాధ్యతలు భుజాన వేసుకోవాల్సి వస్తుంది. విందులు, వినోదాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శివుడిని పూజిస్తే శుభం కలుగుతుంది.

వృశ్చికం

కీలక విషయాల్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారం అందుతుంది. అయితే సమయానికి నిద్రాహారాలు పాటించాలి. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల సానుకూల ఫలితాలు అందుకుంటారు.

ధనస్సు

కీలకమైన విషయాలకు సంబంధించి కుటుంబీకులు, బంధుమిత్రులు, పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగానే వస్తుంది. గతంలో ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఇష్టదేవతలను పూజించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు అందుకుంటారు.

మకరం

శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. పెద్దల నుంచి సహకారం అందుకుంది. శారీరక శ్రమ వల్ల కొన్ని ఇబ్బందులు పడతారు. కీలక నిర్ణయాల్లో కుటుంబీకుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. వెంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల సానుకూల ఫలితాలను పొందుతారు.

కుంభం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల ఫలితాలు అందుకుంటారు. విందులు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సంతోషంగా గడుపుతారు. ఒక శుభవార్త కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. దైవారాధన మాత్రం మానకండి.

మీనం

వీరికి శుభఘడియలు నడుస్తున్నాయి. ప్రారంభించిన పనులు సమయానికి సజావుగా పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. శివుడిని పూజించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు అందుకుంటారు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read: Sri Lanka: మరింతగా రగిలిపోతున్న లంక.. 3,800 కోట్ల డాలర్ల ఆర్ధిక సాయం ప్రకటించిన భారత్..

Telangana: నిరుద్యోగులకు సర్కార్ తీపి కబురు.. ముందుగా 72 వేల ఉద్యోగాల భర్తీ.. మంత్రి కీలక ప్రకటన

Vinegar Benefits: సమ్మర్ సీజన్‌లో ఆపిల్ సైడర్ వెనిగర్‌తో అద్భుతమైన ప్రయోజనాలు.. అవేంటంటే..