Horoscope Today (18th July): జ్యోతిష్య శాస్త్రాన్ని విశ్వసించేవారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. గ్రహాలు, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని ఒకరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందని లెక్కించడంతో పాటు వాటికి పరిహారాలు కూడా సూచిస్తారు జ్యోతిష్య పండితులు. మరి 12 రాశుల వారికి మంగళవారం నాడు దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): రోజంతా చాలా వరకు ప్రశాంతంగా గడిచి పోతుంది. దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో కొన్ని కీలక బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తారు. కుటుంబ వ్యవహారాల విషయంలో కొద్దిగా జాగ్ర త్తగా మెలగటం మంచిది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. దైవ కార్యాలలో పాల్గొం టారు. పిల్లల గురించి శుభవార్తలు వింటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆర్థిక వ్యవహారాలలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. మోసపోవడానికి లేదా నష్టపోవడానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు ఒకరిద్దరు బంధువుల సహాయంతో పూర్తి అవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాలలో కూడా కొద్దిగా లాభాలు కనిపి స్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ముఖ్యమైన పనులు కాలయాపన లేకుండా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాలు సారా వరకు చక్కబడతాయి. ఆదాయం పెరిగేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొంతవరకు సఫలం అయ్యే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో రాణిస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాలలో మీ మాటకు, మీ చేతకు విలువ పెరుగుతుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. రోజంతా గౌరవ ప్రదంగా సాగిపోతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వ్యాపారాలలో లాభాల పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. మీ ఆలోచనలు, మీ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు కూడా అనుకూలంగా పూర్తి అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. స్నేహితులు, స్నేహితులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. కొందరు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. బంధువుల నుంచి ఒక శుభవార్త అందుతుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఒక ముఖ్యమైన శుభకార్యంలో పాల్గొంటారు. ఒకరిద్దరు స్నేహితులకు సహాయం చేయడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు సామరస్యంగా సాగిపోతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కుటుంబ వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. కుటుంబపరంగా నిర్ణయాలు తీసుకునే ముందు జీవిత భాగస్వామితో సంప్రదించడం మంచిది. వృత్తి ఉద్యోగాలు సాఫీగా హ్యాపీగా సాగిపోతాయి. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. గృహ, వాహన సంబంధమైన అవ రోధాలు తొలగుతాయి. వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. కొద్దిగా పని ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వ్యాపారం మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ, వివాహ సంబంధ మైన శుభవార్తలు వినే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన మంచి కబురు అందుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కుటుంబంలో సుఖసంతోషాలు చోటుచేసుకుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా బాధ్యతలు పెరగటం, ఒత్తిడి ఎక్కువ కావడం జరుగుతుంది. కొద్దిగా ఓర్పు సహనాలతో వ్యవహరిస్తే అంతా మంచే జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి జీవితం చాలా వరకు లాభసాటిగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నప్పటికీ పని భారం వల్ల, బరువు బాధ్యతల వల్ల కొద్దిగా అసంతృప్తికి గురవుతారు. ప్రస్తుతానికి దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వేగంగా వాహనాలు నడపవద్దు. వ్యాపారం నిలకడగా సాగిపోతుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఎక్కువగా దైవచింతనలో కాలం గడుపుతారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. వృత్తి ఉద్యోగాలు గౌరవప్రదంగా సాగిపోతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా మారుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.