AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (అక్టోబర్ 14, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఉద్యోగం మారేందుకు ప్రస్తుతానికి ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. మిథున రాశి వారు కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 14th October 2024
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 14, 2024 | 5:01 AM

Share

దిన ఫలాలు (అక్టోబర్ 14, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఉద్యోగం మారేందుకు ప్రస్తుతానికి ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. మిథున రాశి వారు కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ సమర్థత విషయంలో అధికారుల నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందే అవకాశం ఉంది. గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో పూర్తవుతాయి. ఆర్థికంగా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులకు శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగం మారేందుకు ప్రస్తుతానికి ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. తండ్రి సాయంతో ఆస్తి వివాదం నుంచి బయట పడతారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. చేపట్టిన పనులు నిదా నంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధుమిత్రు లతో చిన్నపాటి వివాదాలుంటాయి. వ్యాపారాల్లో కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తి జీవితం సాఫీగా, ఉత్సాహంగా సాగిపోతుంది. ఉద్యోగ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఎంతో కష్టపడి ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఇంటికి ఇష్టమైన బంధుమిత్రుల రాకపోకలుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయ త్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదన్నట్టుగా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆర్థిక పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విహార యాత్ర చేసే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త హోదాలు పొందుతారు. వ్యాపారాల్లో లాభాలకు లోటుండకపోవచ్చు. అదనపు ఆదాయ ప్రయ త్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులు సొంత ఊర్లోనే తగిన ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందక కొద్దిగా ఇబ్బంది పడతారు. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభ సాటిగా సాగిపోతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కొద్దిగా నిరుత్సాహపరుస్తాయి. ప్రయాణాల్లో కొద్ది పాటి ఇబ్బందులుంటాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో అన్యో న్యత పెరుగుతుంది. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. ఆరోగ్యం సజావుగా సాగుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగి ఇబ్బంది పడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు అనుకోకుండా మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

చాలా కాలంగా ఒత్తిడికి గురి చేస్తున్న ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. పెళ్లి ప్రయత్నాల విషయంలో ఆప్తుల నుంచి శుభవార్త వింటారు. నూతన వస్తు సామగ్రి కొను గోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో అధికారులను పనితీరుతో ఆకట్టు కుంటారు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. కుటుంబ విషయాల మీద శ్రద్ద పెరుగుతుంది. జీవిత భాగస్వామితో మరింత అన్యోన్యత ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు వృద్ధి చెందుతాయి. చేపట్టిన పనులు, వ్యవహారాలు సకాలంలో సజావుగా పూర్తవుతాయి. ఉద్యోగుల మీద అధికారులకు నమ్మకం ఏర్పడి అదనపు బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి.

మకరం (ఉత్తరాషాడ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టడం మీద శ్రద్ధ పెడతారు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఇష్టమైన మిత్రులు, సన్నిహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. సమా జంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

కొత్త ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యక్తిగత కారణాల వల్ల ఆకస్మిక ప్రయాణాలు తప్పక పోవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మిత్రులతో పుణ్యక్షేత్రాలు సంద ర్శిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపడతారు. ఉద్యోగంలో సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. తోబుట్టువులతో ఆర్థిక వివాదాలు తొలగిపోతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. పిల్లల పురోగతికి సంబంధించి ఊహించని శుభ వార్త వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఆదాయ ప్రయత్నాల మీద మరింతగా శ్రద్ధ పెడతారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో సహచరులకు వీలైనంతగా సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపా రాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది.

అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!
రూ.6 లక్షల జీతంతో.. RBIలో ఉద్యోగాలు! రాత పరీక్ష లేకుండానే ఎంపిక
రూ.6 లక్షల జీతంతో.. RBIలో ఉద్యోగాలు! రాత పరీక్ష లేకుండానే ఎంపిక
రూ.40 లక్షలు దోచుకున్నాక మళ్ళీ అదే బెదిరింపు.. కట్ చేస్తే..
రూ.40 లక్షలు దోచుకున్నాక మళ్ళీ అదే బెదిరింపు.. కట్ చేస్తే..
ఏంటీ.. ధురంధర్ సినిమా డైరెక్టర్ భార్య తెలుగులో హీరోయినా.. ?
ఏంటీ.. ధురంధర్ సినిమా డైరెక్టర్ భార్య తెలుగులో హీరోయినా.. ?