Horoscope Today: ఆ రాశుల వారి ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి.. మంగళవారం దినఫలాలు..
దిన ఫలాలు (ఏప్రిల్ 09, 2024): మేష రాశి వారికి ఆదాయం, ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటాయి. వృషభం రాశివారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. మిథునం రాశి వారికి కొందరు మిత్రులకు అండగా నిలబడతారు. ఆర్థికంగా సహాయం చేస్తారు. 12 రాశుల వారికి మంగళవారం నాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి..
దిన ఫలాలు (ఏప్రిల్ 09, 2024): మేష రాశి వారికి ఆదాయం, ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటాయి. వృషభం రాశివారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. మిథునం రాశి వారికి కొందరు మిత్రులకు అండగా నిలబడతారు. ఆర్థికంగా సహాయం చేస్తారు. 12 రాశుల వారికి మంగళవారం నాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆదాయం, ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశముంది. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆఫర్లు కలిసివస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల ఉత్తమ ఫలితాలుంటాయి. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. కొత్త పరిచయాలు బాగా విస్తృతమవుతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశముంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుంచి బయటపడతారు. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయానికి లోటుండదు కానీ, అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
కొందరు మిత్రులకు అండగా నిలబడతారు. ఆర్థికంగా సహాయం చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రోజంతా సంతృప్తికరంగా సాగిపోతుంది. ఇంటా బయటా పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆదరణ, ప్రోత్సాహకాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలకు కొరత ఉండదు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా ఆశించిన శుభవార్త వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. సన్నిహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు చక్కబెడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆస్తి వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఘన విజయాలు సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశముంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. శుభకార్యాలు, దైవకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో కొత్త పద్ధతులు ప్రవేశపెడతారు. వృత్తి జీవితం లాభసాటిగా సాగిపోతుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కొందరు మిత్రుల తోడ్పాటుతో పెండింగు పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా, ఆశాజనకంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభముంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
తల్లితండ్రుల ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగే అవకాశముంది. బంధుమిత్రులతో ఊహించని సమస్యలు తలెత్తే సూచన లున్నాయి. చేపట్టిన వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు వచ్చే అవకాశముంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, వ్యాపారాల్లో ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. ముఖ్యమైన వ్యవహారాలను సకా లంలో పూర్తి చేసి, ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరు ద్యోగులు ఉద్యోగంలో చేరడం జరుగుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా గడిచిపోతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. స్నేహితుల మధ్య, బంధువుల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరిస్తారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కుటుంబసభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. నిరుద్యోగులు ఒకటి రెండు శుభ వార్తలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
నిరుద్యోగులకు స్నేహితుల సహాయంతో ఆఫర్లు అందే అవకాశముంది. ఇంటా బయటా అనుకూ లతలు పెరిగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఏ ప్రయత్నమైనా విజయవంతంగా పూర్తవుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. ఇంట్లో శుభ కార్యాలు నిర్వ హించే అవకాశముంది. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. బాధ్యతలు కూడా ఎక్కువవు తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలను అందుకుంటారు. సంపాదనకు ఏమాత్రం లోటుండదు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వ్యాపార, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి జీవితం బిజీగా మారిపోతుంది. సమాజంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. కొంత ఆలస్యంగానైనా రావలసిన డబ్బు చేతిఝకి అందు తుంది. కొందరు బంధువులతో పేచీలు తలెత్తుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగానే ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో కాస్తంత జాగ్రత్తగా వ్యవహ రించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, వ్యాపారాల రీత్యా ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనుల్లో కొద్దిపాటి ఆలస్యాలు జరిగే అవకాశముంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపో తాయి. ఆర్థిక సమస్యలు తగ్గడం ప్రారంభమవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా, ఉత్సాహంగా సాగిపోతాయి. సమాజంలో ప్రముఖుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. చేపట్టిన పనులు, వ్యవహారాలను వేగంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగులకు జీతభత్యాలు, పదోన్నతుల విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.