Horoscope Today: ఆ రాశి వారికి వేతనాలు అంచనాలకు మించి పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి శుక్రవారం రాశిఫలాలు

దిన ఫలాలు (జూన్ 7, 2024): మేష రాశికి చెందిన ఉద్యోగులకు స్థాన చలనానికి లేదా బాధ్యతల మార్పునకు అవకాశముంది. వృషభ రాశి వారికి ఇష్టమైన బంధుమిత్రుల నుంచి అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి. మిథున రాశి వారికి కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి.మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి వారికి వేతనాలు అంచనాలకు మించి పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి శుక్రవారం రాశిఫలాలు
Horoscope Today 07th June 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Jun 08, 2024 | 9:17 PM

దిన ఫలాలు (జూన్ 7, 2024): మేష రాశికి చెందిన ఉద్యోగులకు స్థాన చలనానికి లేదా బాధ్యతల మార్పునకు అవకాశముంది. వృషభ రాశి వారికి ఇష్టమైన బంధుమిత్రుల నుంచి అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి. మిథున రాశి వారికి కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి.మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కుటుంబసమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో నిర్ణయాలు, ఆలోచనలు కలసి వస్తాయి. ఉద్యోగులకు స్థాన చలనానికి లేదా బాధ్యతల మార్పునకు అవకాశముంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. కొన్ని వ్యక్తిగత సమస్యలు, చిక్కుల నుంచి బయటపడటానికి అవకాశం ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఇష్టమైన బంధుమిత్రుల నుంచి అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం సంతృ ప్తికరంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యులతో శుభ కార్యంలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు నిలక డగా ముందుకు సాగుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. సర్వత్రా మీ మాట చెల్లుబా టవుతుంది. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఇంటా బయటా విశ్రాంతి లేని విధంగా బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. చేపట్టిన పనుల్లో అవరోధాలు తొలగిపోతాయి. లాభసాటి ప్రయాణాలు చేయడం జరుగుతుంది. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు అలవికాని లక్ష్యాలను అప్పగిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొందరు మిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడతారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. చాలా కాలంగా పూర్తి కాని పనులను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదం ఒకటి పెద్దల జోక్యంతో ఒక కొలిక్కి వస్తుంది. వృత్తి, వ్యాపారాల తీరుతెన్ను లను మార్చేయడం జరుగుతుంది. ఉద్యోగులకు అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ఉద్యో గాల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యతకు లోటుండకపోవచ్చు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది కానీ, కుటుంబ పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో ఆశిం చిన ఎదుగుదల ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందు తాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు కూడా అనుకూల ఫలితాలనిస్తాయి. కుటుంబం సభ్యుల కార ణంగా ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతాయి. కుటుంబ కలహాలు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం పరవాలేదు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

నిరుద్యోగుల ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ఇంటా బయటా మీ నిర్ణయాలు, ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సల హాలు తీసుకోవడం చాలా మంచిది. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలను అధిగమించి లాభాల బాట పడతారు. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభించడంతో పాటు, వేతనాలు అంచనాలకు మించి పెరిగే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఇష్టమైన బంధుమిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కీలక వ్యవహారాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో ప్రోత్సాహ కాలు అందుకుంటారు. వృత్తి జీవితం సానుకూల మలుపు తిరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. కుటుంబంలోనూ, పిల్లల విషయంలోనూ శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆదాయ మార్గాలు కొద్దిగా పెరుగుతాయి. రుణ సమస్యలు, ఒత్తిళ్లు తగ్గుతాయి. ముఖ్యమైన వ్యవ హారాలను సకాలంలో పూర్తి చేసి ఊరట చెందుతారు. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా మారతాయి. ఉద్యోగుల మీద అధికారులు అతిగా ఆధారపడే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి అనుకూలతలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఇతరుల బాధ్యతలను కూడా నెత్తిన వేసుకోవడం జరు గుతుంది. వ్యాపారాల్లో పోటీదార్ల సమస్య ఉంటుంది. బంధు వర్గం నుంచి ఆశించిన శుభ వార్తలు అందుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమ స్యలు బాధిస్తాయి. అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. ప్రయాణాలు వాయిదా పడే అవ కాశం ఉంది. వృత్తి జీవితం అనుకూలంగా సాగిపోతుంది. విదేశాల నుంచి శుభవార్తలు అందుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందదాయక సంఘటనలు చోటు చేసుకుంటాయి. కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. కొందరు బంధుమిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పద వులు లభించే అవకాశముంది. అనవసర ఖర్చులు, సహాయాల వల్ల ఇబ్బంది పడే సూచనలు న్నాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. అటు అధికారులతో, ఇటు సహోద్యోగు లతో సానుకూలతలు పెరుగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. రావల సిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. కుటుంబంతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. కొద్దిగా ఆరోగ్య సమస్యలుంటాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

కుటుంబ సభ్యులతో అనుకోని వివాదాలు కలుగుతాయి. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులుం టాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపార, ఉద్యోగాలు ఊపందుకుం టాయి. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదాయ వృద్ధికి సంబం ధించిన ప్రయత్నాలు ఆశించిన సత్ఫలితాలనిస్తాయి. ఆధ్యాత్మి చింతన బాగా పెరుగుతుంది.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!