Life Partner Astrology: వృషభ రాశిలో శుక్ర గ్రహం.. ఆ రాశుల వారి సతీమణి జీవితంలో శుభ యోగాలు..!
జ్యోతిష శాస్త్రం ప్రకారం సప్తమ స్థానం, శుక్ర గ్రహ స్థితిగతులను బట్టి సతీమణి అదృష్ట దురదృష్టాల గురించి చెప్పాల్సి ఉంటుంది. సప్తమ స్థానం, శుక్ర గ్రహం అనుకూలంగా ఉన్న పక్షంలో సతీమణికి తప్పకుండా అదృష్టం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. సతీమణి వల్ల యోగం పట్టే అవకాశం కూడా ఉంటుంది.
జ్యోతిష శాస్త్రం ప్రకారం సప్తమ స్థానం, శుక్ర గ్రహ స్థితిగతులను బట్టి సతీమణి అదృష్ట దురదృష్టాల గురించి చెప్పాల్సి ఉంటుంది. సప్తమ స్థానం, శుక్ర గ్రహం అనుకూలంగా ఉన్న పక్షంలో సతీమణికి తప్పకుండా అదృష్టం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. సతీమణి వల్ల యోగం పట్టే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం శుక్రుడు ఈ నెల 13 వరకు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. ఆ తర్వాత కూడా తన మిత్ర క్షేత్రమైన మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఇక సప్తమ స్థానం కూడా అనుకూలంగా ఉన్న పక్షంలో ఆ రాశివారికి సతీమణికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం మేషం, వృషభం, కర్కా టకం, కన్య, వృశ్చికం, మకర రాశులకు శుక్రుడు, సప్తమ స్థానం బాగా అనుకూలంగా ఉన్నందు వల్ల మరో నెల రోజుల పాటు సతీమణి జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
- మేషం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన శుక్రుడు కుటుంబ స్థానంలో, పైగా స్వస్థానంలో ఉన్నందువల్ల దాంపత్య జీవితం నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది. సతీమణికి అనేక మార్గాల్లో ఆర్థిక లాభం కలుగుతుంది. మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. గృహ, వాహన యోగాలు కలగడానికి అవకాశం ఉంది. వస్త్రాభరణాలు కొనే సూచనలున్నాయి. కుటుంబంలో సుఖ సంతో షాలు వెల్లి విరుస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది.
- వృషభం: ఈ రాశిలో రాశ్యధిపతి, కళత్ర కారకుడైన శుక్రుడు సంచారం చేస్తున్నందువల్ల, సప్తమాధిపతి కుజుడు కూడా స్వస్థానంలో ఉన్నందువల్ల ఈ రాశివారి సతీమణికి ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఒక ప్రముఖురాలిగా చెలామణీ కావడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదాతో పాటు జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. భారీగా కానుకలు లభించే సూచనలు ఉన్నాయి. కుటుంబపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
- కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో లాభాధిపతి శుక్రుడి సంచారం జరుగుతున్నందువల్ల, సప్తమాధిపతి శని కూడా స్వస్థానంలో ఉన్నందువల్ల సతీమణి జీవితం సానుకూల మలుపులు తిరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగు తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం వృద్ధి చెందుతాయి. తప్పకుండా హోదాలు, జీత భత్యాలు పెరిగే అవకాశం ఉంది. సంతాన యోగం పడుతుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది.
- కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్ర సంచారం వల్ల, సప్తమాధిపతి గురువు కూడా శుక్రుడితో కలిసి ఉన్నందువల్ల ఈ రాశివారి సతీమణికి సుఖ సంతోషాలతో జీవితం సాగిపోతుంది. దాంపత్య జీవి తంలో అనుకూలతలు పెరుగుతాయి. విదేశీయానానికి అవకాశం ఉంది. తీర్థయాత్రలు, విహార యాత్రలు చేయడం జరుగుతుంది. బాగా అదృష్టం కలిసి వస్తుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో ప్రాభవం, వైభవం వృద్ధి చెందుతాయి. వృత్తి జీవితంలో గుర్తింపు లభిస్తుంది.
- వృశ్చికం: ఈ రాశికి సప్తమంలో సప్తమాధిపతి శుక్రుడే ఉండడం వల్ల జీవిత భాగస్వామికి సంపద వృద్ధి చెందుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. సతీమణికి అనుకూలమైన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్న పక్షంలో హోదాలు పెరిగే సూచనలున్నాయి. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. అనేక విధాలుగా శుభ వార్తలు వినడం జరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
- మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నందువల్ల, సప్తమాధిపతి కూడా అనుకూల సంచారం చేస్తున్నందువల్ల, దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలున్నా, విభేదాలున్నా తొలగిపోతాయి. అనుకూలతలు బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రుల్లోనే కాక, అధికారుల నుంచి కూడా ఆదరణ పెరుగుతుంది. మంచి పరి చయాలు ఏర్పడతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.