Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు హోదా పెరుగుతుంది.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (జూన్ 6, 2024): మేష రాశి వారికి పిల్లల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు హోదా పెరుగుతుంది.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
Horoscope Today 06th June 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 06, 2024 | 5:01 AM

దిన ఫలాలు (జూన్ 6, 2024): మేష రాశి వారికి పిల్లల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాల్లో లాభాలపరంగా ఆశించిన పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో మీ మీద అధికారులకు నమ్మకం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ తాయి. ఏ పని తలపెట్టినా సానుకూలంగా పూర్తవుతుంది. వాహన యోగం పడుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వ్యాపా రాల్లో లాభాలకు లోటుండదు. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. బంధువుల సహా యంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. కుటుంబంలో శుభకార్యాలు తలపెడతారు. ఇక డాక్టర్లు, లాయర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. శక్తి సామర్థ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి జీవితం సాఫీగా, సజావుగా సాగిపోతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తగ్గు ముఖం పడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలు లాభాల బాటపడతాయి. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. వ్యయ ప్రయాసలున్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. అవసరాలకు తగ్గట్టుగా డబ్బు అందుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి మాట్లాడడం మంచిది. బంధువుల జోక్యంతో ఇబ్బంది పడతారు. ప్రయాణాల వల్ల లాభముంటుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇతరుల బాధ్యతలను తలకెత్తుకోవాల్సి వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపారాల్లో నష్టాల నుంచి క్రమంగా బయటపడతారు. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో బాగా బిజీ అయిపోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండకపోవడం, వాగ్దానాలు చేయకపోవడం ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. అధికారుల నుంచి అనుకూలతలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఎంత కష్టపడ్డా కొద్దిపాటి లాభాలకు మాత్రమే అవకాశముంది. కొన్ని ముఖ్య మైన వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. మిత్రులు, కుటుంబ సభ్యుల నుంచి సహ కారం లభిస్తుంది. కుటుంబసమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులు కలు స్తారు. కుటుంబ పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవు తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

తల్లితండ్రుల నుంచి బాగా డబ్బు అందే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యం తలపెడతారు. ముఖ్య మైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఏ పని చేపట్టినా సఫలమయ్యే అవకాశ ముంది. ఇష్టమైన బంధుమిత్రులతో విందులో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలు న్నాయి. ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో డిమాండుతో పాటు రాబడి బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. దాదాపు అన్ని పనులూ సకాలంలో పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాల పెరు గుదలకు అవకాశముంది. వ్యాపారాల్లో అనుకోని శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఆశించిన స్పందన లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాల నిస్తాయి. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం చేపట్టినా సత్ఫలితాలనిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఉద్యోగంలో చిన్నా చితకా సమస్యలున్నా వాటిని తేలికగా అధిగమిస్తారు. పెళ్లి ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సమేతంగా ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వ్యాపారాలను కొద్ది మార్పులతో లాభాల బాట పట్టిస్తారు. ఉద్యోగంలో అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాల వల్ల బాగా ఉపయోగం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాస లుంటాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత బాగా పెరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉంటుంది. సహోద్యోగులతో బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపడతారు. వ్యాపారాలను విస్తరించే అవకాశం ఉంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఒకరిద్దరు మిత్రులకు సహాయం చేస్తారు. ముఖ్యమైన వ్యవహా రాలు సానుకూలంగా పూర్తవుతాయి. జీవిత భాగస్వామి నుంచి ఒకటి రెండు శుభవార్తలు అందు తాయి. అద్దె ఇల్లు మారడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందనలు అందడం ప్రారంభిస్తాయి. ఉద్యోగంలో అధికారులతో కొద్దిగా సమస్యలు తలెత్తుతాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఇష్ట మైన బంధువుల్ని కలుసుకుంటారు. ముఖ్యమైన పనులన్నీ అనుకోకుండా పూర్తవుతాయి. ఆదా యానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారతాయి.