Zodiac Signs: మీన రాశిలో రాహువు సంచారం.. ఆ రాశుల వారికి విదేశీయాన యోగం పట్టనుంది..!
విదేశాలకు కారకుడైన రాహువు మీన రాశిలో అనుకూల సంచారం చేస్తుండడం, విదేశాలకు వెళ్లడం వంటి శుభపరిణామాలకు అవకాశం కల్పించే గురు, శుక్ర గ్రహాలు వృషభ రాశిలో బలంగా ఉండడం వల్ల కొన్ని రాశులకు విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. విదేశాలకు వెళ్లడానికి, అక్కడ స్థిరపడడానికి సంబంధించి ఇప్పుడు ఎటువంటి ప్రయత్నం చేపట్టినా అది తప్పకుండా సఫలం అవుతుంది.
విదేశాలకు కారకుడైన రాహువు మీన రాశిలో అనుకూల సంచారం చేస్తుండడం, విదేశాలకు వెళ్లడం వంటి శుభపరిణామాలకు అవకాశం కల్పించే గురు, శుక్ర గ్రహాలు వృషభ రాశిలో బలంగా ఉండడం వల్ల కొన్ని రాశులకు విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. విదేశాలకు వెళ్లడానికి, అక్కడ స్థిరపడడానికి సంబంధించి ఇప్పుడు ఎటువంటి ప్రయత్నం చేపట్టినా అది తప్పకుండా సఫలం అవుతుంది. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, మకరం, మీన రాశులకు ఈ విదేశీయాన యోగం పడుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించడం, అక్కడ స్థిరపడడం, విదేశీ సొమ్మును అనుభవించడం వంటి శుభ పరిణామాలు ఈ ఆరు రాశుల వారి జీవితాల్లో చోటు చేసుకుంటాయి.
- మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో రాహువు సంచారం వల్ల ఈ రాశివారికి విదేశాల్లో ఉద్యోగం సంపా దించుకోవడానికి అవకాశాలు అంది వస్తాయి. విదేశాలకు వెళ్లడానికి ఎటువంటి ఆటంకాలున్నా తొలగిపోవడమే కాకుండా, అక్కడ ఉద్యోగపరంగా స్థిరపడే అవకాశం కూడా ఉంది. ధన స్థానంలో శుభ గ్రహాలు కూడా ఉన్నందువల్ల ఈ రాశివారు తప్పకుండా విదేశీ ధనాన్ని అనుభవించడానికి అవకాశముంటుంది. విదేశీ సంబంధమైన ప్రయత్నాలకు ఇప్పుడు సమయం అనుకూలంగా ఉంది.
- వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో రాహువు సంచారం వల్ల, ఇదే రాశిలో శుభ గ్రహాల సంచారం వల్ల ఈ రాశికి విదేశీ సంబంధమైన ధన లాభానికి అవకాశముంది. ఇతర దేశాల్లో ఉద్యోగానికి సంబంధిం చిన పరీక్షలు, ఇంటర్వ్యూలలో వీరు ఘన విజయాలు సాధిస్తారు. విదేశీ ఉద్యోగాల్లో వీరికి శీఘ్ర పురోగతి కూడా ఉంటుంది. మంచి పరిచయాలు, సిఫార్సుల ద్వారా వీరు విదేశాలకు ఉద్యోగ నిమిత్తం వెళ్లే అవకాశం ఉంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితోనే పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
- మిథునం: ఈ రాశికి ఉద్యోగ స్థానంలో రాహువు సంచారం విదేశీ ఉద్యోగాలకు బాగా అనుకూలంగా ఉంది. అదే సమయంలో ఈ రాశికి వ్యయ స్థానంలో శుభ గ్రహాల సంచారం వల్ల విదేశాల నుంచి అనేక ఆఫర్లు అందడం జరుగుతుంది. సాధారణంగా వీరు తీర ప్రాంత దేశాలకు వెళ్లి స్థిరపడడం జరుగు తుంది. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా అక్కడే స్థిరపడే అవకాశముంది. అంచనాలకు మించిన ఉద్యోగం లభించే సూచనలున్నాయి. ఉద్యోగపరంగా భారీగా సంపాదించే అవకాశముంది.
- కర్కాటకం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో రాహు సంచారంతో పాటు, లాభస్థానంలో శుభ గ్రహాల సంచారం వల్ల విదేశాలకు వెళ్లాలన్న చిరకాల వాంఛ అనుకోకుండా నెరవేరుతుంది. కొద్ది ప్రయత్నంతో వీరికి విదేశీ ఆఫర్లు అందే సూచనలు కూడా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన పరీక్షలు, ఇంటర్వ్యూ లలో ఘన విజయాలు సాధిస్తారు. బంధుమిత్రుల నుంచి కూడా ఆశించిన సహకారం లభిస్తుంది. ఈ సమయంలో విదేశాలకు వెళ్లినవారు తప్పకుండా అక్కడే స్థిరపడే అవకాశం కూడా ఉంది.
- మకరం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో రాహువు శుభ సంచారం వల్ల తప్పకుండా విదేశీ యానానికి అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా వీరికి విదేశీ యాన యోగం పట్టే అవకాశం ఉంది. ఆశించిన ఉద్యోగంలో స్థిరపడి, ఆదాయం పెంచుకోవడం జరుగుతుంది. తీర ప్రాంత దేశాల్లో వీరు వృత్తి, ఉద్యోగాలపరంగా స్థిరపడడం జరుగుతుంది. పంచమ స్థానంలో శుభ గ్రహాల సంచారం వల్ల విదేశాల్లో, విదేశీ ఉద్యోగాల్లో వీరి ప్రతిభా పాటవాలు వెలుగులోకి వచ్చే సూచనలు ఉన్నాయి.
- మీనం: ఈ రాశిలో రాహువు సంచారం వల్ల విదేశీ ఉద్యోగాలకు అనేక ఆఫర్లు, అవకాశాలు అందే సూచన లున్నాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధించడం జరుగుతుంది. ప్రయ త్నాలను బట్టి వీరు అతి సమీప భవిష్యత్తులో విదేశీ ఉద్యోగం సంపాదించుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి తృతీయ స్థానంలో శుభ గ్రహాల సంచారం వల్ల అతి కొద్ది ప్రయత్నంతో వీరు తమ ఆశయాలను సాధించడానికి, విదేశాల్లో స్థిరపడడానికి అవకాశం కలుగుతుంది.