Zodiac Signs: గురువు మీద శుభ దృష్టి.. ఆ రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు..!

Telugu Astrology: ప్రస్తుతం వృషభ రాశిలో వక్ర గతిలో సంచారం చేస్తున్న గురు గ్రహం మీద వృశ్చిక రాశిలో ఉన్న రవి, బుధుల దృష్టి పడినందువల్ల ధనం, గృహం, సంతానం, పురోగతి వంటి అంశాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రవికి గురువు సప్తమ స్థానంలో ఉన్నందువల్ల గురువుకు ‘అతి వక్రం’ పట్టింది. దీనివల్ల కొన్ని రాశులకు సత్వర ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది.

Zodiac Signs: గురువు మీద శుభ దృష్టి.. ఆ రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు..!
Telugu AstrologyImage Credit source: Getty Images
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 22, 2024 | 6:55 PM

ప్రస్తుతం వృషభ రాశిలో వక్ర గతిలో సంచారం చేస్తున్న గురు గ్రహం మీద వృశ్చిక రాశిలో ఉన్న రవి, బుధుల దృష్టి పడినందువల్ల ధనం, గృహం, సంతానం, పురోగతి వంటి అంశాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రవికి గురువు సప్తమ స్థానంలో ఉన్నందువల్ల గురువుకు ‘అతి వక్రం’ పట్టింది. దీనివల్ల కొన్ని రాశులకు సత్వర ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ అతి వక్ర గురువు వల్ల మేషం, కర్కాటకం, సింహం, తుల, మకరం, మీన రాశుల వారికి అనేక విషయాల్లో శీఘ్ర పురోగతి, శీఘ్ర వృద్ధి అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితి జనవరి 4వ తేదీ వరకు కొనసాగుతుంది.

  1. మేషం: ఈ రాశికి ద్వితీయ స్థానంలోని వక్ర గురువు వల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద ఎక్కువగా శ్రద్ధ పెడతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి, అదనపు ఆదాయాన్ని షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక వ్యవహారాల్లో మదుపు చేసే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో సరికొత్త పనితీరుతో అధికారులను మెప్పిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో కొన్ని కొత్త నిర్ణయాలు అమలు చేస్తారు. పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది.
  2. కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో గురువు అతి వక్రం వల్ల ఆదాయ మార్గాల మీద మరింతగా దృష్టి కేంద్రీ కరించడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు బాగా విస్తరించడం, వృద్ధి చెంద డం జరుగుతుంది. పిల్లలు రికార్డు స్థాయిలో ఘన విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి బాగా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో శక్తి సామర్థ్యాలను నిరూపించుకుని, అందలాలు ఎక్కు తారు. లాభసాటి పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది.
  3. సింహం: ఈ రాశికి దశమ స్థానంలో సంచారం చేస్తున్న గురువులో వేగం పెరగడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా ఆశించిన స్పందన లభి స్తుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కుటుంబంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఆదాయ మార్గాల వల్ల అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభించే అవకాశం ఉంది.
  4. తుల: ఈ రాశికి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న గురువు ప్రబలంగా వక్రించడం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. రావలసిన డబ్బు వసూలవుతుంది. వ్యక్తిగత వివాదాలు, సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు లభించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి.
  5. మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న గురువు అతిగా వక్రించినందువల్ల లాభదాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పిల్లలు కొద్ది ప్రయత్నంతో ఘన విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి కూడా అవకాశం ఉంది. మనసులోని కోరికలు, ఆశల్లో కొన్ని నెరవేరుతాయి.
  6. మీనం: రాశినాథుడు గురువు వృషభ రాశిలో అతి వక్రం చెందినందువల్ల ఏ రంగానికి చెందినవారికైనా ఆదాయ వృద్ధి, పదవీ లాభం కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా అందలాలు ఎక్కు తారు. వ్యాపారాలు నష్టాల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల ఊహిం చని లాభాలు కలుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పెండింగ్ పనులన్నీ పూర్తయి ఆర్థికంగా కూడా లాభాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి.