Horoscope Today: ఆ రాశుల వారి ఆదాయం పెరుగుతుంది.. సోమవారం దినఫలాలు ఇదిగో..

Horoscope Today (May 25, 2026) - Rashi Phalalu: పలురాశుల వారికి శుభయోగాలు కనిపిస్తున్నాయి. మేషం రాశి వారి వృత్తి, ఉద్యోగాల్లో మీ శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. వృషభం రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి సోమవారం దినఫలాలు అదేవిధంగా గ్రహస్థితులు ఎలా ప్రభావం చూపనున్నాయో తెలుసుకోండి.

Horoscope Today: ఆ రాశుల వారి ఆదాయం పెరుగుతుంది.. సోమవారం దినఫలాలు ఇదిగో..
Horoscope Today

Edited By:

Updated on: May 25, 2026 | 6:35 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, ఉద్యోగాల్లో మీ శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. రుణాలు వసూలవుతాయి. రావాల్సిన డబ్బు కూడా అందుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశించిన సంబంధం ఖాయమవుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయానికి లోటుండదు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాల్లో కొద్దిగా మార్పులు చేసి లబ్ధి పొందుతారు. గట్టి పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనుల్ని పూర్తి చేయడం వల్ల ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం మారడా నికి చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక విషయాల్లో సానుకూల దృక్పథంతో వ్యవహరించడం అవసరం. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆస్తి వివాదాలు పెద్దల జోక్యంతో చాలావరకు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం జరుగుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. సమర్థతకు గుర్తింపు లబిస్తుంది. బంధువుల వివాదాలకు కాస్తంత దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా ఎవరితోనూ వాదోపవాదాలు పెట్టుకోవద్దు. మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా పురోగమిస్తాయి. కొత్త ప్రయత్నాలకు ఇది చాలావరకు అనుకూల సమయం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, ఉద్యోగాలలో అధికారులు, సహోద్యోగులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. కొందరు చిన్ననాటి మిత్రులను, బంధువుల్ని కలుసుకుంటారు. శుభ కార్యంలో పాల్గొంటారు. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ కార్యంలో పాల్గొంటారు. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): అవసరానికి తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన అనుకూలత ఏర్పడుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వృత్తి, వ్యాపారాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. సొంత నిర్ణయాలు బాగా కలిసివస్తాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతలను, విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. చేపట్టిన వ్యవహారాలు ఉత్సాహంగా పురోగమిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశముంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంత మవుతుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహా రాలు పూర్తవుతాయి. తల్లితండ్రుల ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. బంధుమిత్రుల వల్ల కీలక పనులు సానుకూలపడతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆదాయానికి లోటుండదు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా, ప్రోత్సాహకరంగా పురోగమిస్తాయి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. కీలక విషయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని బాగా లాభపడతారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన ప్రయత్నాలకు అవరోధాలు తొలగుతాయి. బంధువుల నుంచి ఆదరపూర్వక ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న వ్యవహారాలు అనుకున్నట్టు పూర్త వుతాయి. కుటుంబ జీవితం బాగా ప్రశాంతంగా సాగిపోతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది కానీ, సహచరుల నుంచి బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధుమిత్రులకు సహాయం చేసే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరిగి తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు అమలు చేసి లబ్ధి పొందుతారు. కొన్ని శుభవార్తలువింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. కొందరు ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు వృద్ధి చెందుతాయి. బంధుమిత్రుల నుంచి ఆద రణ లభిస్తుంది. మీ సలహాలు, సూచనలకు విలువ ఏర్పడుతుంది. విలువైన వస్తువులు బహుమతులుగా లభిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు అందుతాయి. విందు వినో దాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంబంధించిన సమాచారం ఒకటి బాగా సంతృప్తిని కలిగిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): గ్రహ బలం కాస్తంత అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా ప్రశాంతంగా, అనుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల వల్ల ఆశించిన ఫలి తాలుంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, దైవ కార్యాల మీద ఖర్చు ఖర్చు బాగా పెరుగుతుంది. ఇంటా బయటా అనుకూలతలకు లోటుండదు. పిల్లల చదువుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.

Follow Us