Horoscope Today (5th Sep): వీరికి ప్రయాణాల్లో ప్రమాదాలు ఎదురు కావొచ్చు.. 12 రాశుల వారి రాశిఫలాలు..

| Edited By: Narender Vaitla

Sep 05, 2023 | 6:52 AM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం (సెప్టెంబరు 5న) 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉండనున్నాయి..? మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది..? ఇక్కడ రాశుల వారీగా తెలుసుకోండి. దానికి అనుగుణంగా మీ రోజును ప్రారంభించండి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా కొన్ని రకాల ఇబ్బందులను అధిమగించండి..

Horoscope Today (5th Sep): వీరికి ప్రయాణాల్లో ప్రమాదాలు ఎదురు కావొచ్చు.. 12 రాశుల వారి రాశిఫలాలు..
Today Horoscope
Follow us on

Horoscope Today (5th Sep): భవిష్యత్తులో ఏం జరుగుతుందో గ్రహ, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని జ్యోతిష్య పండితులు ముందే లెక్కిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం (సెప్టెంబరు 5న) 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉండనున్నాయి..? మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది..? ఇక్కడ రాశుల వారీగా తెలుసుకోండి. దానికి అనుగుణంగా మీ రోజును ప్రారంభించండి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా కొన్ని రకాల ఇబ్బందులను అధిమగించండి..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1):

ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. తీరిక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. డాక్టర్లకు, లాయర్లకు, ఇతర వృత్తులవారికి బాగా డిమాండ్ ఏర్పడుతుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త
ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. సోదర వర్గంతో సమస్యలు పరిష‌్కరించుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. దీర్ఘకాలిక ప్రణాళికలకు సమయం అనుకూలంగా ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2):

వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు అమలు చేయడం మంచిది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహపరుస్తాయి. కుటుంబ పెద్దల్లో ఒకరి ఆరోగ్యం కాస్తంత ఆందోళన కలిగిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విదేశాల నుంచి
ఆశించిన సమాచారం అందుతుంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3):

ఒక శుభకార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలను విస్తరించాలనే ఆలోచన చేస్తారు. ఉద్యోగంలో
జీతభత్యాలకు సంబంధించి శుభవార్త వింటారు. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. సంతానం నుంచి ఆశించిన మంచి వార్తలు వింటారు. జీవిత భాగస్వామికి కూడా మంచి గుర్తింపు లభిస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష):

ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. కుటుంబంలో సుఖ
సంతోషాలకు లోటు ఉండదు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. సమాజంలో మాట చెల్లుబాటు అవుతుంది. కొత్త ప్రయత్నాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1):

ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక ప్రయత్నాల్లో తప్పకుండా విజయం లభిస్తుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. సమా జంలో పలుకుబడి పెరుగుతుంది. ఎంతో సమయ స్ఫూర్తితో వ్యవహరించి వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇతరులతో, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడి, ఇబ్బందిపడే సూచనలు కనిపిస్తున్నాయి. సోదర వర్గంతో సఖ్యత పెరిగే అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2):

వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కారం అయి, సామరస్యం ఏర్పడుతుంది. అనారోగ్య బాధ నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. ఆదాయం పెరిగి రుణ సమస్యలు తగ్గుముఖం పడతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారే అవకాశం ఉంది. వ్యాపారాల్లో అప్రయత్నంగా లాభాలు పెరుగుతాయి. మనసులోకి కోరికలు నెరవేరుతాయి. కష్టార్జితం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ వృథా ఖర్చులు కూడా పెరిగి ఇబ్బంది పడతారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3):

అనుకున్న పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. కొత్త కార్యక్రమాలు చేపడతారు. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. కొందరు మిత్రులు లేదా దగ్గర బంధువులు
తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఆదాయం పెరగ డానికి సంబంధించి కొత్త ఆలోచనలు చేస్తారు. జ్యేష్ట సోదరులకు అండగా నిలబడతారు. వ్యాపా రాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాల్సి
ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట):

కుటుంబ సమస్యలను నిదానంగా పరిష్కరించుకుంటారు. కొద్ది వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. అనుకున్నవి అనుకున్నట్టు జరగకపోవచ్చు కానీ, చివరికి అవి సంతృప్తికరంగానే పూర్తవుతాయి. శత్రు, రోగ, రుణ బాధలు బాగా తగ్గి ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. మీ పనితీరుతో, ప్రతిభతో అధికారులను ఆకట్టుకుంటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1):

వృత్తి, ఉద్యోగాల్లో మీ తెలివితేటలకు, ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో అంచనా లకు మించి లాభాలు అందుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో,
ముఖ్యంగా పిల్లల వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి చాలావరకు కోలు కుంటారు. విదేశాల నుంచి మంచి ఆఫర్లు అందుతాయి. విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2):

ధనాదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆదాయ ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు ప్రశాంతంగా సాగిపోతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత ఎక్కువవుతుంది.
చదువుల్లో పిల్లలకు సహాయం చేస్తారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. పితృ సంపద కలిసి వచ్చే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. వ్యాపారాలు
లాభిస్తాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3):

ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. వ్యక్తిగత జీవితంలో ప్రాధాన్యం బాగా పెరుగు తుంది. బంధు మిత్రుల్లో మీ మాటకు, చేతకు విలువ ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్య తలు ఎక్కువగా ఉన్నప్పటికీ,
ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగు తాయి. ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. కొందరు స్త్రీలతో అకారణంగా శత్రుత్వం ఏర్పడు తుంది. జీవిత భాగస్వామికి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాల్లో ప్రమాదాలు ఎదురు కావచ్చు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి):

ధన సంపాదన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మిత్రుల వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే సూచనలున్నాయి. సృజనాత్మక రంగానికి చెందిన వారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రతిభా పాటవాలకు సరైన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

మరిన్ని ఆస్ట్రాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..