Horoscope Today: ఈ రాశులవారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
దిన ఫలాలు (జూన్ 29, 2026): మేషం రాశి వారి ఉద్యోగంలో అధికారుల ఆదరాభిమానాలకు లోటుండదు. వృత్తి, వ్యాపారాల్లో మీ ఆలోచనలు కార్యరూపంలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. వృషభం రాశి వారి ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ విస్తరించే అవకాశం ఉంది. మిథునం ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే మెరుగుపడుతుంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ రోజు (సోమవారం) ఎలా ఉండబోతోందో తెలుసుకోండి.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1):
ఉద్యోగంలో అధికారుల ఆదరాభిమానాలకు లోటుండదు. వృత్తి, వ్యాపారాల్లో మీ ఆలోచనలు కార్యరూపంలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కొన్ని ఖర్చుల్ని తగ్గించుకుంటారు. ఉద్యోగం మారడా నికి సమయం అనుకూలంగా ఉంది. ఆదాయపరంగా ఎటువంటి ప్రయత్నం చేపట్టినా అనుకూలి స్తుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. ఆరోగ్యం చాలావరకు బాగానేఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2):
ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేసినా సఫలం అవుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. దూర ప్రాంతంలో ఉంటున్న పిల్లలు ఇంటికి రావడం జరుగుతుంది. ఆరోగ్యం అను కూలంగా ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3):
ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే మెరుగుపడుతుంది. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు అంచనాలకు మించిన లాభాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలో లాభాలకు ఢోకా ఉండదు. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. బంధువుల రాకపోకలుంటాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష):
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభి స్తాయి. ఆదాయ ప్రయత్నాలు చాలావరకు ఆశించిన ఫలితాలనిస్తాయి. సమాజంలో కూడా ప్రాధా న్యం పెరుగుతుంది. కొత్త బాధ్యతల్ని అప్పగించడం జరుగుతుంది. కొన్ని నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో ఇతరుల మీద ఆధారపడవద్దు. సొంత పనుల మీద బాగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1):
వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా వృద్ధి చెందుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. ఉద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగాలకు సంబంధించి ఆశించిన శుభవార్త అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాల్లో కూడా శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2):
ఉద్యోగంలో బాగా ఒత్తిడి ఉంటుంది. అదనపు బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపా రాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగం మారడానికి ప్రయత్నించేం దుకు ఇది మంచి సమయం. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3):
వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాలు బాగా బిజీ అవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వ్యాపారాలు లాభాల పంట పండిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. రాదనుకున్న డబ్బు కూడా కొద్ది ప్రయత్నంతో చేతికి అందు తుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట):
ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లు తదితర ఆర్థిక లావాదేవీల వల్ల విశేష లాభాలు కలుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. కొద్ది ప్రయత్నంతో ముఖ్య మైన వ్యవహారాలు, కార్యకలాపాలు పూర్తవుతాయి. కుటుంబంలో కొద్దిగా చికాకులు తలెత్తే అవ కాశం ఉంది. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగి పోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1):
రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2):
కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభ సాటిగా పురోగమిస్తాయి. ఉద్యోగ జీవితంలో పనిభారం ఎక్కువగా ఉన్నా, ఆశించిన ప్రతిఫలం అందుతుంది. ఆరోగ్యానికి లోటుండదు. విద్యార్థుల నుంచి శుభవార్తలు వింటారు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3):
ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఎక్కువగా ఉంటుంది. యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంత ఉద్యోగానికి ఆఫర్ అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి):
వృత్తి, ఉద్యోగాల్లో శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు బాగా రాణిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. విద్యార్థులు బాగా వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధుమిత్రులతో శుభ కార్యంలో పాల్గొంటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొందరు మిత్రులకు ఆర్థికంగా సాయం చేస్తారు. ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొన్ని దైవ కార్యాల్లో పాల్గొంటారు.