సనాతన హిందూ ధర్మంలో సూర్య, చంద్ర గ్రహణాలకు ప్రత్యేక స్థానం ఉంది. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం గ్రహణం 15 రోజుల వ్యవధిలో అంటే సూర్య, చంద్ర గ్రహణాలు ఒకే నెలలో ఏర్పడితే.. అశుభంగా పరిగణిస్తారు. 2022 సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం రేపు అంటే 08 నవంబర్ 2022న ఏర్పడనుంది. పంచాంగం ప్రకారం.. చంద్రగ్రహణం మంగళవారం మధ్యాహ్నం 02:38 గంటలకు ప్రారంభమై సాయంత్రం 06:18 గంటలకు ముగుస్తుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వేర్వేరు సమయాల్లో కనిపిస్తుంది. ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం భారతదేశంలోని తూర్పు ముఖంగా ఉన్న నగరాల్లో అధికంగా ఇతర నగరాల్లో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ అయితే చంద్రగ్రహణ సమయాన్ని సూతకాలంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో చంద్రగ్రహణం సమయం, అనుసరించాల్సిన నియమాలు, నివారణల గురించి వివరంగా తెలుసుకుందాం.
చంద్రగ్రహణం ప్రారంభ సమయం సాయంత్రం – 05:32 (దేశ రాజధాని ఢిల్లీ సమయం ప్రకారం)
చంద్రగ్రహణం ముగింపు సమయం – సాయంత్రం 06:18 గంటలకు
గ్రహణ వ్యవధి – 45 నిమిషాల 48 సెకన్లు
చంద్రగ్రహణంలో తీసుకోవాల్సిన ఆహార నియమాలు:
చంద్రగ్రహణ సమయంలో ఆహారానికి సంబంధించి చాలా ముఖ్యమైన నియమాలు చెప్పబడ్డాయి. హిందూ మత విశ్వాసం ప్రకారం, గ్రహణ కాలంలో ఆహారం వండకూడదు లేదా తినకూడదు. అయితే ఈ నియమం అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు, పిల్లలు, వృద్ధులకు వర్తించదు. వీరు కావాలంటే గ్రహణ కాలంలో పండ్లు, మందులు మొదలైన వాటిని తీసుకోవచ్చు. చంద్ర గ్రహణం రోజున సూతకం కాలం పూర్తి అయిన వెంటనే ఆహారం తీసుకోవాలని మీరు మీ ఇంట్లో ఏదైనా ఆహారాన్ని తయారు చేసినట్లయితే.. ఆ ఆహారాన్ని స్వచ్ఛంగా ఉంచడానికి, గ్రహణానికి ముందు అందులో తులసి ఆకులను, లేదా దర్భగడ్డిని ఉంచండి. ఇలా ఆహార పదార్థాలలో తులసి ఆకులను లేదా దర్భగడ్డిని ఉంచడం వల్ల దానిపై గ్రహణ ప్రతికూల ప్రభావం ఉండదని నమ్మకం.
సనాతన సంప్రదాయంలో, చంద్రగ్రహణాన్ని అశుభంగా భావిస్తారు. గ్రహణాన్ని చూడటం అశుభం, హానికరం అని విశ్వసిస్తారు. హిందూ మత విశ్వాసం ప్రకారం.. గ్రహణం సమయంలో ప్రయాణం చేయరు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా చంద్రగ్రహణం సమయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పుట్టబోయే బిడ్డపై దుష్ప్రభావం పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు, ఇతర వ్యక్తులు గ్రహణ కాలంలో కత్తెర మరియు కత్తులు వంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. చంద్రగ్రహణం సమయంలో కూడా నిద్రపోకూడదు.
చంద్రగ్రహణంలో పూజ నియమాలు
చంద్రగ్రహణ సమయం సూతకం.. కనుక ప్రార్ధనా స్థలాన్ని పూజ మందిరాన్ని మూసివేస్తారు. గ్రహణ సమయంలో దేవీదేవతా విగ్రహాలను తాకరు. అయితే గ్రహణ కాలంలో.. ఇష్టమైన దేవీదేవతలు సంబదించిన మంత్రాన్ని జపించవచ్చు. ఇలా మంత్రాలను పఠించడం ద్వారా కోరికలు నెరవేర్చుకోవడానికి గ్రహణ కాలం ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది.
చంద్రగ్రహణం ముగిసిన తర్వాత చేయాల్సిన పనులు
చంద్రగ్రహణం తర్వాత స్నానం చేయాలి. తర్వాత శుభ్రంగా ఉతికిన బట్టలు ధరించాలి. పూజా స్థలం.. దేవతలను శుభ్ర పరచాలి. గంగాజలం చల్లి పవిత్రం చేయాలి. ఇంటిని శుభ్రపరచుకుని ఆహారం పదార్ధాలను రెడీ చేసుకోవాలి.
ఏ రాశిపై చంద్రగ్రహణం ప్రభావం ఉండనుందంటే:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. భూమిపై జన్మించిన వెంటనే.. వ్యక్తిపై నవగ్రహాలు శుభ, అశుభ ప్రభావాలను చూపుతాయి. చంద్రగ్రహణం సమయంలో 12 రాశుల వారు కూడా ప్రభావితమవుతారు. కాశీ విశ్వనాథ ఆలయ ధర్మకర్త , ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ దీపక్ మాల్వియా ప్రకారం, ఈ సంవత్సరం చివరి గ్రహణం మేషం, వృషభం, సింహం, కన్య, తుల, ధనుస్సు, మకరం,మీనం , మిథునరాశి వారికి జీవితంలో సమస్యలు పెరుగుతాయి. కర్కాటకం, వృశ్చికం, కుంభరాశికి సంబంధించిన వ్యక్తులకు ఇది శుభప్రదంగా ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)