AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mercury Retrograde: జూలై 21న బుధుడు అస్తమయం.. ఈ 6 రాశులకు చెందిన వ్యక్తులు నక్క తోక తోక్కినట్లే

జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు నవ గ్రహాల్లో ముఖ్యమైన గ్రహం. బుధవారానికి అధిపతి. దేవ దూత బుధుడు తెలివితేటలు, జ్ఞానం, విజ్ఞానం, వ్యాపారానికి కారకుడు. బుధుడు ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నాడు. బుధుడు జూలై 21, 2025న కర్కాటకంలో అస్తమించబోతున్నాడు. ఈ 6 రాశుల వారికి బుధుడు అస్తమించడం శుభప్రదంగా నిరూపించబడుతుంది.

Mercury Retrograde: జూలై 21న బుధుడు అస్తమయం.. ఈ 6 రాశులకు చెందిన వ్యక్తులు నక్క తోక తోక్కినట్లే
Mercury Retrograde
Surya Kala
|

Updated on: Jul 08, 2025 | 9:26 PM

Share

నవ గ్రహాల్లో ముఖ్యమైన గ్రహం బుధుడు కర్కాటక రాశిలో 20 రోజుల పాటు అస్తమించే స్థితిలో ఉంటాడు. కర్కాటక రాశిలో బుధుడు అస్తమించడం అనేక రాశులకు శుభప్రదంగా ఉంటుంది. బుధుడు తెలివితేటలు, జ్ఞానం, కమ్యూనికేషన్, వాక్కు, వ్యాపారం, చర్మానికి కారకుడిగా పరిగణించబడుతున్నాడు. బుధుడు జూలై 21వ తేదీ 2025 సోమవారం సాయంత్రం 7.30 గంటలకు కర్కాటక రాశిలో అస్తమిస్తాడు. ఆగస్టు 9 ఉదయం 5 గంటలకు బుధుడు కర్కాటక రాశిలో ఉదయిస్తాడు. ఈ రాశులకు బుధుడు అస్తమించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

వృషభ రాశి: ఈ రాశికి చెందిన వారికి బుధ గ్రహం అస్తమించడం వల్ల ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి. బుధ గ్రహం వల్ల ఈ రాశి వారు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. బుధాస్తమయంతో వీరికి పరిస్థితులు మెరుగుపడటం ప్రారంభమవుతాయి. తోబుట్టువులతో కొనసాగుతున్న వివాదం శాంతించవచ్చు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

కర్కాటక రాశి: బుధ గ్రహం అస్తమించడం వల్ల కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు కలగానున్నాయి. ఈ సమయంలో కర్కాటక రాశి వారు శ్రేయోభిలాషులు కాని వారిని గుర్తించగలుగుతారు. వీరికి ఎటువంటి నష్టం జరగదు. కుటుంబంలో కొనసాగుతున్న వివాదాలు పరిష్కారమవుతాయి.

ఇవి కూడా చదవండి

సింహరాశి: బుధ గ్రహం అస్తమించడం సింహరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు ఖర్చులు తక్కువగా ఉంటాయి. డబ్బు ఆదా చేస్తారు. అంతేకాదు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉంటారు. ఈ రాశికి చెందిన విద్యార్థులు తమ చదువులపై దృష్టి పెట్టగలుగుతారు.

వృశ్చిక రాశి: బుధుడు అస్తమించడం వల్ల వృశ్చిక రాశి వ్యక్తులు సానుకూల ఫలితాలను పొందనున్నారు. వీరి కృషికి ఫలితం లభిస్తుంది. ప్రయోజనం పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రజలు వేరు చేసే ప్రతి పనిని ఇష్టపడతారు.

ధనుస్సు రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు బుధ గ్రహం అస్తమించడం వల్ల శుభ ఫలితాలను పొందనున్నారు. ఈ సమయంలో వీరికి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. సింహ రాశి వారు కష్టపడి పని చేయడం ద్వారా విజయం సాధిస్తారు. ఎప్పటి నుంచో పూర్తీ కాకుండా అసంపూర్ణంగా ఉన్న పనిని పూర్తి చేసే అవకాశం ఉంది.

మకర రాశి: బుధుడు అస్తమించడం వల్ల మకర రాశి వారి పని మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఏదైనా కారణం చేత ఈ బుధ సంచారము వీరికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంటే.. బుధుడు అస్తమించడం వల్ల, ఆ ప్రతికూలత తగ్గుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..