AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rasi Phalalu: ఈ రోజు రాశి ఫలాలు.. ఈ రాశివారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. పలుకుబడి పెరుగుతుంది.. ఈ రోజు రాశి ఫలాలు

Rasi Phalalu: ఈ రోజు (మార్చి 12 శుక్రవారం) రాత్రి చంద్రుడు కుంభ రాశిలో సంచరించనున్నాడు. ఇప్పటికే ఈ రాశిలో సూర్యుడు, శుక్రుడు ఉన్నారు. చంద్రుడి ఈ రవాణా కర్కాటక రాశి ప్రజలకు..

Rasi Phalalu: ఈ రోజు రాశి ఫలాలు.. ఈ రాశివారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. పలుకుబడి పెరుగుతుంది.. ఈ రోజు రాశి ఫలాలు
Subhash Goud
|

Updated on: Mar 12, 2021 | 7:36 AM

Share

Rasi Phalalu: ఈ రోజు (మార్చి 12 శుక్రవారం) రాత్రి చంద్రుడు కుంభ రాశిలో సంచరించనున్నాడు. ఇప్పటికే ఈ రాశిలో సూర్యుడు, శుక్రుడు ఉన్నారు. చంద్రుడి ఈ రవాణా కర్కాటక రాశి ప్రజలకు ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే మిథున రాశి వారికి ఇబ్బంది, ఆటంకం కారణంగా మానసిక ఉద్రిక్తతను కలిగి ఉంటారు. ఈ రోజు పలు రాశుల వారు పలు విషయాల్లో పలు జాగ్రత్తలు వహించాల్సి వస్తుంది. అమ్మవార్ల పారాయణం చేయడం వల్ల ఎంతో మేలుజరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు.

మేషరాశి

ఈ రాశివారు ఈరోజు పలు ఆలయాలు దర్శిస్తారు. ఆరోగ్య విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు ఆంజనేయస్వామిని దర్శనం చేసుకోవడం మంచిది.

వృషభరాశి

ఈ రాశివారు తమకు రావాల్సిన బాకీల విషయంలో పట్టుదలతో వ్యవహరిస్తుండాలి. లేకపోతే బాకీలు వసూలు అయ్యే అవకాశాలు ఉండవు. ఈ రాశివారు గణపతి నామస్మరణం చేసుకోవడం ఎంతో మంచిది.

మిథున రాశి

ఈ రాశివారికి ఈ రోజు పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు గణపతిస్తోత్రం చదివితే ఎంతో మంచిది.

కర్కాటక రాశి

ఈ రాశివారు చేపట్టిన పనులలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. పలు విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. గోవింద నామస్మరణ ఎంతో ఉపయోగపడుతుంది.

సింహరాశి

ఈ రాశివారికి దూర ప్రయాణాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. శివతాండవ పారాయణం ఎంతో మేలు చేస్తుంది.

కన్యరాశి

కన్యరాశివారు తెలియని విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆర్థికపరమైన విషయాలు సమసిపోతుంటాయి. కళహాస్తేశ్వర పారాయనం ఎంతో మేలు చేస్తుంది.

తుల రాశి

ఈ రాశివారికి ఉన్న సమస్యలు ఈ రోజు తీరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీరామరక్షక పారాయణం ఎంతో మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి

ఈ రాశివారు వ్యాపార విషయంలో కొన్ని, కుటుంబ విషయంలో కొన్ని ఒత్తిడిలు ఎదుర్కొంటుంటారు. దీంతో పలు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఈ రాశివారికి అమ్మవారి నామస్మరణం ఎంతో మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి

ఈ రాశివారికి ఆర్థిక విషయంలో కొంత మార్పులు జరుగుతుంటాయి. వీరు పలు విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అమ్మవారి పారాయణం పఠించడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది.

మకర రాశి

ఈ రాశి వారు చేపట్టే పనుల్లో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. పలు రకాల ఆలోచనలు ప్రారంభం అవుతూ ఉంటాయి. వేర్వేరు రూపాయల్లో పేదలకు పాలు, పండ్లు దానం చేసుకోవడం మంచిది.

కుంభరాశి

ఈ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి కొన్ని ఒత్తిళ్లు ఏర్పడతాయి. ప్రయాణాల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఈ రాశివారు దుర్గాదేవికి ఎరుపు రంగు పుష్పం సమర్పించుకోవడం ఎంతో మంచిది.

మీన రాశి

ఈ రాశివారికి పరిచయాలు పెరుగుతాయి. వ్యవహారిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అష్టలక్ష్మీ స్తోత్రం పారాయణం ఎంతో మేలు చేస్తుంది.

Follow Us