Zodiac Signs: ఇక ఆ రాశుల వారికి అదృష్టం పట్టుకున్నట్టే.. పట్టందల్లా బంగారమే.. అందులో మీరున్నారా?

| Edited By: Janardhan Veluru

Apr 18, 2023 | 1:02 PM

కొందరికి ఉద్యోగ రూపంలో కలసి వస్తుండగా మరికొందరికి ఆర్థికంగా అదృష్టం తలుపు తడుతుంది. అంతేకాకుండా ఈ ఆరు రాశుల వారికి ఆరోగ్యపరంగా కూడా ఎంతగానో ఉపశమనం లభించే అవకాశం ఉంది.

Zodiac Signs: ఇక ఆ రాశుల వారికి అదృష్టం పట్టుకున్నట్టే.. పట్టందల్లా బంగారమే.. అందులో మీరున్నారా?
Astrology
Follow us on
ఏప్రిల్ నెల ద్వితీయార్థం నుంచి గురు, శుక్ర, బుధ, రవి గ్రహాల మార్పు వల్ల ఆరు రాశుల వారి అదృష్టం పట్టబోతోంది. ఇందులో మేషం, మిధునం సింహం, తుల, ధనస్సు, మీన రాశులు ఉన్నాయి. కొందరికి ఉద్యోగ రూపంలో కలసి వస్తుండగా మరికొందరికి ఆర్థికంగా అదృష్టం తలుపు తడుతుంది. అంతేకాకుండా ఈ ఆరు రాశుల వారికి ఆరోగ్యపరంగా కూడా ఎంతగానో ఉపశమనం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నప్పటికీ అవి సఫలం కాని వారికి కూడా పెళ్లి సంబంధాలు కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశుల వారికి ఎప్పుడు, ఏ రూపంలో అదృష్టం తలుపు తట్టేది ఇక్కడ పరిశీలిద్దాం.
  • మేష రాశి: మేష రాశి వారికి గురు, బుధ గ్రహాలు బాగా అనుకూలంగా ఉండబోతున్నాయి. దీనివల్ల తప్పకుండా వృత్తి ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వారి వారి ప్రయత్నాలను బట్టి ఉద్యోగ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వీసా సమస్యలు ఏవైనా ఉంటే అవి కచ్చితంగా పరిష్కారం అవుతాయి.  ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. అతి ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యి మనశ్శాంతి ఏర్పడుతుంది. కొత్త నిర్ణయాలు కొత్త ఆలోచనలు శుభ ఫలితాలను ఇస్తాయి. ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తే అంత మంచిది. ఏ విషయంలోనూ సందేహించాల్సిన లేదా వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం అన్ని విధాలుగాను అనుకూలిస్తుంది. ఎక్కువగా వినాయకుడిని ఆరాధించితే మంచిది.
  • మిథున రాశి: ఈ రాశి వారికి ఈ నెల అంతా గురు, బుధ గ్రహాల అనుగ్రహం బాగా ఉండబోతోంది. నిరుద్యోగులకు తప్పకుండా మంచి ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యో గంలో ప్రతిభకు గుర్తింపు లభించడంతోపాటు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో కూడా ఆశించిన దాని కంటే ఎక్కువగా ఆర్థిక ప్రయోజనాలు కలసి వస్తాయి. ఇంతవరకు సంతానం లేని వారికి సంతానానికి సంబంధించి శుభవార్త చెవిన పడే అవకాశం ఉంది. తప్పకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆహార విహారాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించే పక్షంలో ఈ నెలాఖరు వరకు ఈ రాశి వారికి ఎదురే ఉండదు. ఆర్థికపరంగా ఎటువంటి ప్రయత్నం చేపట్టినా అది తప్పకుండా సఫలం అవుతుందని చెప్పవచ్చు. తరచూ అమ్మవారి ఆలయంలో అర్చన చేయించడం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.
  • సింహ రాశి: గత కొద్ది కాలంగా ఈ రాశి వారు ఉద్యోగ పరంగా ఆర్థికపరంగా పడుతున్న కష్టాలకు తెరపడే అవకాశం ఉంది. మంచి ఉద్యోగానికి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ప్రయత్నాలన్నీ సానుకూల పడతాయి. శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. విదేశాల్లో వృత్తి, ఉద్యోగాల కోసం, అక్కడ స్థిరపడటం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. బంధు వర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. అన్ని విషయాలలోనూ పాజిటివ్ గా ఉండటం మంచిది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. దాంపత్య జీవి తంలో అన్యోన్యత పెరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం లేదా సుందరకాండ పారాయణం వల్ల అతి త్వరగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.
  • తులా రాశి: ఈ రాశి వారికి గురు, శుక్ర గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉండబోతున్నాయి. అందువల్ల ఒకటి రెండు చక్కని శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఆకస్మిక ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగపరంగా అధికార యోగానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు తప్పకుండా మంచి ఆఫర్లు అందుకొని ఉద్యోగాల్లో స్థిరపడతారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆస్తి విలువ పెరగవచ్చు. బంధు వర్గాల్లో మంచి పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో కూడా ఘన విజయం సాధిస్తారు. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. అదనపు ఆదాయ మార్గాలను చేజిక్కించుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విలాసాలలో మునిగి తేలుతారు. ఇష్ట దైవాన్ని మరింత శ్రద్ధగా ఆరాధిస్తే అంతా మంచే జరుగుతుంది.
  • ఇవి కూడా చదవండి
  • ధనుస్సు రాశి: ఈ రాశి వారికి అన్ని విధాలుగాను కలసివచ్చే సమయం ఇది. కొత్త ఆలోచనలను, కొత్త నిర్ణ యాలను వెంటనే అమలులో పెట్టడం మంచిది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ప్రణాళికా బద్ధంగా వ్యవహరించి ప్రయత్నాలు సాగించడం చాలా అవసరం. ఉద్యోగ పరంగా, ఆర్థికపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండకపోవచ్చు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుం బంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా అధికార యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు కుదుట పడుతుంది. పిల్లల సమస్యలు ఏవైనా ఉంటే అవి పరిష్కారమయి మనశ్శాంతి లభిస్తుంది. ఇతరు లకు మేలు జరిగే పనులు చేస్తారు. పెండింగులో ఉన్న ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఎంతో ఆత్మవిశ్వాసంతో కొత్త పుంతలు తొక్కుతారు. ప్రతిరోజు ఉదయం దుర్గాదేవి స్తోత్రం పారాయణం చేయడం చాలా మంచిది.
  • మీన రాశి: ఈ రాశి వారికి ఈ నెలాఖరు వరకు గురు, బుధ, శుక్ర గ్రహాలు ఎంతగానో అనుకూలంగా ఉంటున్నాయి. మూడు శుభగ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. దీనివల్ల ఏ పని తలపెట్టినా అది తప్పకుండా విజయవంతం అవుతుంది. ఉద్యోగ, ఆర్థిక, వివాహ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. ఆస్తులను సమకూర్చుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్న పరిచయస్తులతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. అనారోగ్యం నుంచి చాలావరకు కోలుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ప్రతి ఉదయం శివుడినీ ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ..