AP Eamcet 2020: నేడు ఏపీ ఎంసెట్ నిర్వహణపై స్పష్టత..!
AP Eamcet 2020: ఏపీలో ఎంసెట్ పరీక్షను ఈ నెల 27 నుంచి నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ఎంసెట్‌తో సహా ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. శనివారం వివిధ ఉమ్మడి పరీక్షల కన్వీనర్లతో భేటి అయిన మంత్రి ఆదిమూలపు సురేష్.. ఇవాళ మరోసారి సమావేశం కానున్నారు. దీనితో ఈరోజు ఎంసెట్‌తో సహా ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై […]

AP Eamcet 2020: ఏపీలో ఎంసెట్ పరీక్షను ఈ నెల 27 నుంచి నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ఎంసెట్‌తో సహా ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. శనివారం వివిధ ఉమ్మడి పరీక్షల కన్వీనర్లతో భేటి అయిన మంత్రి ఆదిమూలపు సురేష్.. ఇవాళ మరోసారి సమావేశం కానున్నారు.
దీనితో ఈరోజు ఎంసెట్‌తో సహా ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మంత్రి కన్వీనర్లతో చర్చించనున్నారు. ఏపీ ఎంసెట్‌కు సుమారు 2.71 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక కళాశాలలు, విద్యాసంస్థలు మూసి ఉండటంతో చాలామంది విద్యార్ధులు స్వస్థలాలకు వెళ్ళిపోయారు. వారందరూ కూడా సొంత జిల్లాలను పరీక్షా కేంద్రాలుగా ఎంచుకున్నారు.
అటు రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షా కేంద్రాలుగా ఉన్న 23 కళాశాలలు ప్రస్తుతం క్వారంటైన్ సెంటర్లుగా ఉన్నాయి. వాటిపై స్పష్టత రావాల్సి ఉంది. అటు తెలంగాణ నుంచి ఏపీ ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్నవారి కోసం హైదరాబాద్‌లో 4 సెంటర్లను కేటాయించారు. గ్రేటర్ పరిధిలో కరోనా వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పరీక్ష ఎలా నిర్వహించాలా అన్న దానిపై సందిగ్దత నెలకొంది.
Also Read:
విద్యార్ధులకు ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఏపీ: ఆగష్టు 3 నుంచి ఇంటర్ కళాశాలల రీ-ఓపెన్.. 196 పనిదినాలు..!