తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా పెరుగుతోన్న కరోనా కేసులు..
రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ పలు కంటైన్మెంట్ జోన్లలో జులై 31 వరకూ లాక్ డౌన్ పొడిగించాయి ప్రభుత్వాలు. ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయనికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా..

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ పలు కంటైన్మెంట్ జోన్లలో జులై 31 వరకూ లాక్ డౌన్ పొడిగించాయి ప్రభుత్వాలు. ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయనికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా.. గడిచిన 24 గంటల్లో 1933 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవి 19,14 కాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో 19 మందికి వైరస్ సోకింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 29,168కి చేరింది. వీరిలో 13,428 మంది చికిత్స పొందుతుండగా.. 15,412 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక నిన్నఒక్క రోజే 19 మంది కరోనాతో చనిపోగా.. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 328కి చేరింది.
కాగా, గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 268 కేసులు నమోదు కాగా.. అనంతపురం 129, చిత్తూరు 159, గుంటూరు 152, కడప 94, కృష్ణా 206, కర్నూలు 237, నెల్లూరు 124, విశాఖ 49, ప్రకాశం 134, శ్రీకాకుళం 145, విజయనగరం 138 పశ్చిమ గోదావరి జిల్లాలో 79 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 11,53,849 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అటు కర్నూలు(3405), గుంటూరు(3019), అనంతపురం(3290) జిల్లాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదు కాగా, కర్నూలు(101), కృష్ణా(80) జిల్లాల్లో అత్యధిక మరణాలు సంభవించాయి.
ఇక తెలంగాణలో ఆదివారం 1,269 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో నిన్న 8 మంది చనిపోయారు. ఇప్పటివరకూ 34 వేల 671 కేసులు నమోదు కాగా 356 మంది చనిపోయారు. ఇంకా 11, 883 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో తాజాగా 1,563 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 22,482 మంది డిశ్చార్జి అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆదివారం 800 మంది కరోనా బారిన పడ్డారు.
అలాగే.. రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్ జిల్లాలో 94, సంగారెడ్డి జిల్లాలో 36, ఖమ్మం జిల్లాలో 1, వరంగల్ అర్బన్ జిల్లాలో 12, వరంగల్ రూరల్ జిల్లాలో 2, నిర్మల్ జిల్లాలో 4, కరీంనగర్ జిల్లాలో 23, జగిత్యాల జిల్లాలో 4, యాదాద్రి జిల్లాలో 7, మహబూబాబాద్ జిల్లాలో 8, పెద్దపల్లి జిల్లాలో 9, మెదక్ జిల్లాలో 14, మహబూబ్ నగర్ జిల్లాలో 17, మంచిర్యాల జిల్లాలో 3, నల్గొండ జిల్లాలో 15, సిరిసిల్ల జిల్లాలో 3, ఆదిలాబాద్ జిల్లాలో 4, వికారాబాద్ జిల్లాలో 6, నాగర్ కర్నూల్ జిల్లాలో 23, జనగాం జిల్లాలో 6, నిజామాబాద్ జిల్లాలో 11., వనపర్తి జిల్లాలో 15, సిద్దిపేట జిల్లాలో 3, సూర్యాపేట జిల్లాలో 7, గద్వాలజిల్లాలో 7 కేసులు నమోదు అయినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.