ఏపీ కరోనా అప్డేట్: 11 లక్షలు దాటిన పరీక్షలు.. రికవరీ రేట్ 52 శాతం.!

కరోనా పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల సంఖ్య 11 లక్షలు దాటింది.

ఏపీ కరోనా అప్డేట్: 11 లక్షలు దాటిన పరీక్షలు.. రికవరీ రేట్ 52 శాతం.!
Follow us

|

Updated on: Jul 11, 2020 | 8:49 AM

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు జగన్ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే కరోనా పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల సంఖ్య 11 లక్షలు దాటింది. గురువారం ఉదయం 9 గంటల నుంచి 24 గంటల్లో ఏపీలో 21,020 మందికి కరోనా పరీక్షలు నిర్వహించడంతో.. రాష్ట్రంలో మొత్తంగా కరోనా పరీక్షల సంఖ్య 11,15,635కు చేరింది. అంతేకాకుండా ఏపీలో రికవరీ రేటు కూడా ఎక్కువగా ఉంది.

కాగా ఏపీలో ప్రస్తుతం 25,422 పాజిటివ్ కేసులు ఉండగా.. అందులో 11,936 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక 13,194 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు వరుసగా మూడో రోజు కరోనా నుంచి వెయ్యి మందికి పైగా కోలుకుని డిశ్చార్జ్ కావడం విశేషం. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ కారణంగా 292 మంది మరణించారు.

రాష్ట్రంలో కరోనా గణాంకాలు ఇలా ఉన్నాయి..

  • ఇన్ఫెక్షన్‌ రేటు  –  2.28%
  • రికవరీ రేటు –   51.90%
  • మరణాల రేటు –   1.15%

Also Read:

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రతీ జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్..!

తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటర్ సిలబస్‌లో 30% కోత.!

భక్తులకు ముఖ్య గమనిక.. వాటి జోలికి వెళ్లొద్దంటూ టీటీడీ హెచ్చరిక..

ఏపీ ప్రజలకు గమనిక.. ఆరోగ్యశ్రీ పరిధిలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రులు ఇవే..