
మైలవరంలో మైనింగ్ వివాదం మంటలు రేపుతోంది. వైసీపీ, టీడీపీల మధ్య సవాళ్ళు ప్రకంపనలు రేపుతున్నాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌పై మాజీ మంత్రి దేవినేని ఉమ అక్రమ మైనింగ్ ఆరోపణలు గుప్పించారు. ఇదేమని ప్రశ్నిస్తే.. రాజీనామా డ్రామాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. దేవినేని వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. నాపై ఆరోపణలు నిరూపిస్తే రాజానామాకు సిద్ధమని.. ఆయన రాజకీయాలనుంచి వైదొలగడానికి సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. అంతేకాదు.. టీవీ9 అగ్రిమెంటు రెడీచేయాలని వసంతకృష్ణప్రసాద్ కోరారు. తనపై ఆరోపణలు నిరూపించాలంటూ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్… దేవినేనికి ఛాలెంజ్ చేశారు.
ఆరోపణలు నిరూపించాలనీ, లేదంటే దేవినేని ఉమ రాజకీయాల నుంచి వైదొలగాలనీ… ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సవాల్ విసిరారు. తన పుట్టిన రోజున టీవీ9 సాక్షిగా సవాల్ చేస్తున్నానన్న ఎమ్మెల్యే.. టీవీ 9 స్పీకర్ ఫార్మేట్లో డాక్యుమెంట్ రెడీ చేయాలని కోరారు.
అధికారంలో ఉన్నప్పుడు అతను దోచుకోవడం.. ప్రతిపక్షంలో ఉంటే ఎదుటివారితో రాజీపడి డబ్బులు తీసుకోవడం అతని నైజం అంటూ వసంత కృష్ణప్రసాద్.. దేవినేని ఉమపై ఆరోపణలు గుప్పించారు. దేవినేని డబ్బులు తీసుకుంటూ పిత్తిరి ముత్తైదువలా కూర్చున్న విషయం టీడీపీ వాళ్ళకే తెలుసన్నారు ఎమ్మెల్యే.
అక్రమ మైనింగ్, అక్రమ ఇసుక టోల్‌గేట్‌ల దందాకి దేవినేని ఉమాయే ఆద్యుడని ఆరోపణలు గుప్పించారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఎవరిమీదైనా బురదజల్లగల సత్తా దేవినేనిదన్నారు. దేవినేని ఆరోపణలు గురవింద సామెతంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..