
Perni Nani on Pawan Kalyan: వైసీపీ 45 నుంచి 67 స్థానాలకే పరిమితం అవుతుందని.. జనసేనకు ఆదరణ పెరుగుతోందని.. మనిషికైనా, అధికారానికైనా ఎక్స్‌పెయిరీ డేట్ ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. అయితే.. జనసేనాని పవన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ముందు మీరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో సర్వే చెప్పలేదా? అందులో ఎన్ని గెలుస్తారనేది చిలక జోస్యంలో రాలేదా? అంటూ పేర్నినాని పవన్‌పై మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని.. ఈ మేరకు పెర్నినాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి రాజకీయంగా చాలా తప్పులు చేసినట్లు పవన్ కల్యాణ్ మాట్లాడడం దుర్మార్గమైన విషయమంటూ మండిపడ్డారు. ప్రజారాజ్యం పార్టీకి, సొంత అన్నకు పవన్ వెన్నుపోటు పొడిచారంటూ పేర్నినాని ఆరోపించారు. చిరంజీవి దయతో ఉన్నతస్థాయికి వచ్చిన పవన్.. పరోక్షంగా చిరంజీవిని తప్పుబడుతూ మాట్లాడుతున్నారన్నారు. పవన్ కల్యాణ్ ఓ వీకెండ్ పొలిటీషియన్ అంటూ ఫైరయ్యారు. గతంలో ఆయన మాట్లాడిన మాటలు అందరికీ గుర్తున్నాయన్నారు.
సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న అక్కసుతో.. పవన్ ప్రతిరోజూ విమర్శలు చేయడం పనిగా పెట్టుకున్నారంటూ విమర్శించారు. చంద్రబాబు తప్పులను ఎత్తిచూపడం లేదంటూ విమర్శించారు. 2009లో చంద్రబాబును తప్పుబట్టిన పవన్.. 2014లో అదే వ్యక్తికి ఓటేయమని ప్రజల్ని కోరారని గుర్తు చేశారు. రాజకీయాల్లో పవన్ చేసినన్ని తప్పులు చిరంజీవి చేయలేదని మాజీ మంత్రి చెప్పారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి