Andhra pradesh: ఆధారాలు బయట పెడితే ప్రభుత్వం షేక్‌ అవుతుంది.. సొంత పార్టీపై కోటం రెడ్డి సంచలన వ్యాఖ్యలు

|

Jan 31, 2023 | 2:35 PM

నెల్లూరు రూరల్‌ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అనుచరులతో మాట్లాడుతూ తన ఫోన్‌ ట్యాపింగ్‌ అవుతోందని చెప్పారు. ఆ సమయంలో ఎవరో ఆ ఆడియోను రికార్డ్‌ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే రికార్డ్‌ అయిన కాల్‌లో ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు...

Andhra pradesh: ఆధారాలు బయట పెడితే ప్రభుత్వం షేక్‌ అవుతుంది.. సొంత పార్టీపై కోటం రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Kotamreddy Sridhar Reddy
Follow us on

నెల్లూరు రూరల్‌ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అనుచరులతో మాట్లాడుతూ తన ఫోన్‌ ట్యాపింగ్‌ అవుతోందని చెప్పారు. ఆ సమయంలో ఎవరో ఆ ఆడియోను రికార్డ్‌ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే రికార్డ్‌ అయిన కాల్‌లో ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆధారాలు ఉన్నాయని, వాటిని బయట పెడితే ఇద్దరు ఐపీఎస్‌ల ఉద్యోగాలు పోతాయని వ్యాఖ్యానించారు. స్టేట్‌ గవర్నమెంట్ షేక్‌ అవుతుందని, సెంట్రల్ గవర్నమెంట్ విచారణ జరుపుతుందని కూడా మాట్లాడారు.

ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్‌ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు కోటంరెడ్డి. వైసీపీ అధిష్టానం కొత్త డ్రామాకు తెరలేపిందని మండిపడ్డ ఆయన.. నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి నియోజకవర్గ సమన్వయకర్తగా ఇస్తామని వైసీపీ అధిష్టానం చెబుతోంది.. ప్రస్తుతం రాష్ట్ర సేవా దళ్ అధ్యక్షుడిగా ఉన్న గిరిధర్ రెడ్డి.. వైసీపీ తరఫున పోటీ చేస్తే.. తమ్ముడికి పోటీగా నేను నిలబడను అని స్పష్టం చేశారు.. అంతేకాదు, రాజకీయాలకు గుడ్ బై చెబుతా నంటూ సంచలన ప్రకటన చేశారు.. ఫోన్ ట్యాపింగ్‌ వల్ల నా మనసు కలత చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే కోటం రెడ్డి విషయమై మాజీ మంత్రి బాలినేని స్పందించారు. సొంత పార్టీ నేత ఫోన్‌ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇది కేవలం కోటం రెడ్డి అపోహ మాత్రమే అన్నారు. ట్యాపింగ్‌ విషయమై కోటం రెడ్డి ఎవరికీ చెప్పకుండా బహిరంగంగా విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక ఇదే విషయంపై స్పందించిన మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి స్పందించారు. ఇదంతా టీ కప్పులో తుఫాను లాంటిదని ఆయన అభివర్ణించారు. సాధారణంగా ఫోన్‌ ట్యాపింగ్ జరగవని చెప్పిన కాకాణి, ఏం జరిగిందో తెలుసుకుంటామన్నారు. శ్రీధర్‌ రెడ్డి మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేశారని, మనసుకు ఏదైనా నొచ్చుకున్న సంఘటన ఉంటే చర్చిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..