పెగాసస్ స్పైవేర్‌పై రాష్ట్రంలోనూ, దేశంలోనూ విస్తృతంగా చర్చ జరుగుతోందని వైఎస్‌ఆర్‌సీపీ(YSRCP) రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు(Rambabu) అన్నారు. ఇవాళ ఏపీ అసెంబ్లీలో కూడా చర్చ జరిగిందని చెప్పారు. దీనిపై హౌజ్ కమిటీ వేయాలని నిర్ణయించినట్లు పేర్కొ్న్నారు. పెగాసస్ స్పైవేర్‌ను ఏపీ సీఎం చంద్రబాబు కొన్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారని. అది విస్తృత చర్చకు దారి తీసింద్నారు. వాస్తవానికి గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విపక్షనేతల ఫోన్లు ట్యాపింగ్ చేసి సమాచారం సేకరించారన్న ఆరోపణలు చాలా వచ్చాయన్నారు. ఇప్పుడు మమతాబెనర్జీ చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు చంద్రబాబు బయటకు వచ్చి మాట్లాడలేదని.. లోకేష్ మాత్రం భుజాలు తడుముకుంటూ మాకు సంబంధం లేదని చెబుతున్నాడని అన్నారు.
ఇవాళ మరో విచిత్రం ఏమిటంటే, ఆనాడు ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు మీడియా ముందుకు వచ్చాడని.. ఆయన పదవిలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమాలు చేశారని తేలడంతో సస్పెన్షన్‌లో ఉన్నారని గుర్తు చేశారు. ఆయన ఇంకా సర్వీసులోనే ఉన్నారని. నిజానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏబీ వెంకటేశ్వరరావు, ఇవాళ మీడియా ముందు మాట్లాడుతూ, చంద్రబాబును సమర్థించడం ఒక విచిత్రని చెప్పారు. సర్వీసులో ఉండి, సస్పెన్షన్‌లో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు ఇవాళ ప్రెస్‌మీట్‌లో చాలా మాట్లాడారని… 2019 మే వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడా పెగాసస్ స్పైవేర్ కొనలేదని చెబుతున్నారని.. కానీ నిజానికి ఆ మాట చెప్పాల్సింది ఎవరు? చంద్రబాబు కదా? అని రాంబాబు ప్రశ్నించారు.
ఏబీ వెంకటేశ్వరరావునిజంగా దేశానికి, ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. ఉన్నత పదవిలో ఉండి పంచాయతీలు చేశారని ఆరోపించారు. 23 మంది వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్పించారని విమర్శించారు. వృత్తికి ద్రోహం చేశాడని అన్నారు. చంద్రబాబు సేవలో తరించాడని… ఇప్పుడు కూడా ఆయనను కాపాడడం కోసమే మీడియా ముందుకు వచ్చి కబుర్లు చెబుతున్నాడని చెప్పారు.
Read Also.. Fake Mosquito Refills: వైట్ కిరోసిన్‌తో నకిలీ రీఫిల్స్ తయారీ.. విజయవాడలో బయటపడిన దందా