Andhra Pradesh: ‘వడ్డీతో చెల్లిస్తాం.. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదు’.. అరెస్ట్‌లపై వైసీపీ నేతల సంచలన కామెంట్స్

ఏపీలో కేసుల విషయంలో అధికారులు నలిగిపోతున్నారు. ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెట్టిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఎవరి కళ్లలో ఆనంద కోసమే అత్యుత్సాహం చూపిస్తున్నారంటూ అధికారులకు వార్నింగ్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదూ.. గుర్తించుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Andhra Pradesh: ‘వడ్డీతో చెల్లిస్తాం.. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదు’.. అరెస్ట్‌లపై వైసీపీ నేతల సంచలన కామెంట్స్
Ys Jagan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 28, 2024 | 2:11 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ నేతలపై నమోదవుతున్న కేసులపై వైసీపీ నేతలు కీలక కామెంట్స్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యంగం నడుస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెట్టిస్తోందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అధికారులే టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ నేతలు, సోషల్‌ మీడియా కార్యకర్తలపై నమోదవుతున్న కేసులపై కీలక కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. ఎవరికళ్లల్లో ఆనందం కోసమో అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారని.. ఎక్కడాలేని సెక్షన్స్ కింద కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే తనపై నమోదైన పోక్సో కేసుపై సీరియస్ అయ్యారు చెవిరెడ్డి. అన్నింటికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. అధికారులు ఎక్కడికెళ్లిన వదలమంటూ వార్నింగ్ ఇచ్చారు చెవిరెడ్డి.

ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదు.. వడ్డీతో చెల్లిస్తామంటూ వార్నింగ్..

రాష్ట్రంలో వైసీపీ నేతల అరెస్టులపై మాజీ మంత్రి కన్నబాబు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదు.. ఇప్పటి కంటే వడ్డీతో సహా చెల్లిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు కన్నబాబు..

మాజీ సీఎం జగన్ ఏమన్నారంటే..

కొద్దిరోజుల క్రితం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ సైతం రాష్ట్రంలో పార్టీ నేతల అరెస్ట్‌లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన అధికారులను సప్తసముద్రాలు దాటినా వదిలిపెట్టమంటూ వార్నింగ్ ఇచ్చారు. ఓవైపు వైసీపీ నేతల హెచ్చరికలు, మరోవైపు ప్రభుత్వ ఒత్తిడితో అధికారులు మధ్యలో నలిగిపోతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..