EVMs Verification: వైసీపీ బాయ్‌కాట్.. నిలిచిపోయిన ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ.. బాలినేని కీలక వ్యాఖ్యలు..

|

Aug 19, 2024 | 9:47 PM

ఒంగోలులో ఎలక్షన్ కమిషన్ అధికారులు చేపట్టిన 12 పోలింగ్‌ బూత్‌ల్లోని ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. సుప్రీంకోర్టు గైడ్‌ లైన్స్‌ ప్రకారం రీవెరిఫికేషన్‌ జరగడం లేదంటూ మాక్‌ పోలింగ్‌కు హాజరైన వైసీపీ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రీవెరిఫికేషన్‌ ప్రక్రియను బాయ్‌కాట్‌ చేస్తున్నట్టు ప్రకటించి బయటకు వెళ్ళిపోయారు.

EVMs Verification: వైసీపీ బాయ్‌కాట్.. నిలిచిపోయిన ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ.. బాలినేని కీలక వ్యాఖ్యలు..
Balineni Srinivasa Reddy
Follow us on

ఒంగోలులో ఎలక్షన్ కమిషన్ అధికారులు చేపట్టిన 12 పోలింగ్‌ బూత్‌ల్లోని ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. సుప్రీంకోర్టు గైడ్‌ లైన్స్‌ ప్రకారం రీవెరిఫికేషన్‌ జరగడం లేదంటూ మాక్‌ పోలింగ్‌కు హాజరైన వైసీపీ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రీవెరిఫికేషన్‌ ప్రక్రియను బాయ్‌కాట్‌ చేస్తున్నట్టు ప్రకటించి బయటకు వెళ్ళిపోయారు. దీంతో మాక్‌ పోలింగ్‌ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. మరోవైపు సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారం.. ఈవీఎం యూనిట్‌, కంట్రోల్ యూనిట్‌, వీవీప్యాట్‌లు హ్యాక్‌ అయ్యాయా… లేదా అన్నది చెక్‌ చేయడం లేదంటూ బాలినేని శ్రీనివాస రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. పూర్తివివరాలు తమ ముందుఉంచాలని ఈసీకి హైకోర్టు ఆదేశించింది.. దీనిపై బాలినేని మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారం అభ్యర్ధుల అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని తెలిపారు. ఈ విషయంలో హైకోర్టులో న్యాయం జరగపోతే.. అవసరమైతే సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. తమకు కావాల్సింది మాక్ పోలింగ్ కాదని వెల్లడించారు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొత్తం 26 మంది పోటీ చేయగా.. టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్ధన్ విజయం సాధించారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా 34వేల 60 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఒంగోలులో 12 పోలింగ్‌ బూత్‌లపై అనుమానం వ్యక్తం చేస్తూ.. రీ వెరిఫికేషన్‌ చేయాలంటూ వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసులురెడ్డి 5 లక్షల 66 వేల రూపాయలు చెల్లించారు.

దీంతో కలెక్టర్ తమీమ్ అన్సారియా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ఈ మాక్‌ పోలింగ్‌కు బాలినేని తరపున ప్రతినిధులు హాజరయ్యారు. అయితే, ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లు కూడా లెక్కించాలని బాలినేని ప్రతినిధులు పట్టుబట్టారు. దీనికి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీవీప్యాట్లు లెక్కించడం కుదరదని తేల్చిచెప్పారు.

దీంతో బాలినేని తరఫున హాజరైన ప్రతినిధులు లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయారు. దీంతో ఈవీఎం రీవెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు నిలిపేశారు. ఇక వైసీపీ ప్రతినిధులు లేవనెత్తిన అభ్యంతరాలను ఈసీకి రిపోర్ట్‌ చేస్తామని కలెక్టర్‌ తమీమ్‌ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..