Perni Nani: ఒక్క జగన్‌నే ప్రశ్నిస్తారా..? పవన్ కల్యాణ్‌కు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్..
Perni Nani on Pawan Kalyan: పవన్ చేసిన కామెంట్స్‌కు మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో రైతుల బాధలు గుర్తురాలేదా అని ప్రశ్నించారు.

Perni Nani on Pawan Kalyan: ఏపీలో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. పర్చూరులో ఏర్పాటు చేసిన సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజల నమ్మకాన్ని వైసీపీ కోల్పోయిందన్నారు. సీఎం తప్పుచేస్తే కాలర్ పట్టుకుని నిలదీసేలా ఉండాలని, భవిష్యత్‌లో జనసేన తప్పులు చేసినా ప్రశ్నించాలని సూచించారు. తనను చంద్రబాబు దత్తపుత్రుడు అంటే, ఊరుకోబోమని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. పవన్ చేసిన కామెంట్స్‌కు మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో రైతుల బాధలు గుర్తురాలేదా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, పవన్ ఒక్క జగన్‌నే ప్రశ్నిస్తారా అని పేర్ని నాని నిలదీశారు. 2024 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీచేస్తే, పవన్ దత్తపుత్రుడు కాదని ఒప్పుకుంటామన్నారు. ఎవరు ఎన్ని విమర్శలు, ఆరోపణలు చేసినా, ప్రజలు జగన్ వెంటే ఉన్నారని పేర్ని నాని చెప్పారు. జగన్ నిజాయితీతో పని చేస్తున్నారని, 2024 ఎన్నికల్లోనూ వైసీపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ ప్రభుత్వం రైతులను దగా చేసింది వాస్తవం కాదా.. ఇప్పుడు రైతుల ఇబ్బందులకు అప్పటి ప్రభుత్వం చేసిన మోసం కాదా.. అప్పుడు రైతుల గురించి ఎందుకు ప్రశ్నించలేని నాని పవన్‌ను ప్రశ్నించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీని ప్రశ్నించటమే పవన్ కల్యాణ్‌కు తెలుసు అంటూ నాని విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ పార్టనర్‌గా ఉన్న కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఏం ప్రయోజనం చేస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తే రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన చర్యలు తీసుకోకూడదా..? అంటూ నాని ప్రశ్నించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




