Visakhapatnam News: విశాఖలో సినిమాటిక్ కిడ్నాప్‌లు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబీకులు కిడ్నాప్ కు గురయ్యారు. ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావుతోపాటు, ఎంపీ ఎంవీవీ భార్య, కుమారుడు కిడ్నాప్ కు గురయ్యారు. జీవీ వృత్తిరీత్యా ఆడిటర్.. వైసీపీ నేతగా కూడా ఉన్నారు. ఆయన ఎంపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకి కూడా ఈయనే ఆడిటర్‌గా ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో పార్టనర్ కూడా. గతంలో హాయగ్రీవ భూవివాదంలో మొదటిసారిగా తెరపైకి వచ్చింది జీవీ పేరు. అప్పట్లో జీవీ తనను బెదిరిస్తున్నాడని హాయగ్రీవ సంస్థ డైరెక్టర్ జగదీశ్వరుడు ఆరోపణలు చేశారు. అప్పుడు తొలిసారిగా జీవీ మీడియా ముందుకు వచ్చిన తన వ్యాపారాల వివరాలను బయటపెట్టారు. కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఈ వ్యవహారం తర్వాత ఇప్పుడు ఏకంగా కిడ్నాప్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. జీవీ ఒక్కరే కాదు.. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు కూడా కనిపించడంలేదు. వాళ్లిద్దరినీ అపహరించిన కిడ్నాపర్లు రూ.50కోట్లు డిమాండ్ చేస్తూ ఆడిటర్ జీవీకి ఫోన్ చేశారు. ఆ తర్వాత ఆయన కూడా కనిపించడం లేదంటున్నారు.
అయితే, కిడ్నాప్ వ్యవహారంపై ఎంవీవీ స్పందించారు. తన కుటుంబసభ్యులు సేఫ్ గా ఉన్నట్లు పేర్కొన్నారు. కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. విశాఖపట్నం వెళ్లిన తర్వాత పూర్తి వివరాలను తెలియజేస్తానని తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..