Andhra Pradesh: అసంతృప్తులు, గ్రూప్‌వార్‌పై జగన్‌ ఫోకస్.. రెండో జాబితాపై చంద్రబాబు, పవన్ కసరత్తు..

రేపోమాపో ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో ఏపీ రాజకీయ పార్టీలు మరింత దూకుడు పెంచాయి. ఓవైపు అసంతృప్తులను బుజ్జగిస్తూనే.. మరోవైపు అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నాయి. ఈమేరకు పార్టీ శ్రేణులను పిలిపించుకొని మాట్లాడుతున్నారు ప్రధాన పార్టీల అధినేతలు.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో అంతర్గపోరు, గ్రూప్‌వార్‌పై వైసీపీ అధినేత, సీఎం జగన్ ఫోకస్ చేశారు.

Andhra Pradesh: అసంతృప్తులు, గ్రూప్‌వార్‌పై జగన్‌ ఫోకస్.. రెండో జాబితాపై చంద్రబాబు, పవన్ కసరత్తు..
Ap Politics
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 14, 2024 | 10:42 AM

రేపోమాపో ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో ఏపీ రాజకీయ పార్టీలు మరింత దూకుడు పెంచాయి. ఓవైపు అసంతృప్తులను బుజ్జగిస్తూనే.. మరోవైపు అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నాయి. ఈమేరకు పార్టీ శ్రేణులను పిలిపించుకొని మాట్లాడుతున్నారు ప్రధాన పార్టీల అధినేతలు.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో అంతర్గపోరు, గ్రూప్‌వార్‌పై వైసీపీ అధినేత, సీఎం జగన్ ఫోకస్ చేశారు. టికెట్‌ దక్కని వారితోపాటు గ్రూపులు, వర్గాలతో ఆందోళనలు చేస్తున్న నాయకులను పిలుపించుకొని మాట్లాడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తాడేపల్లి కార్యాలయానికి వచ్చి సీఎం జగన్‌ను కలుస్తున్నారు. దీంతో అధికారిక సమీక్షలు రద్దు చేసుకొని మరీ.. పార్టీ నేతలను చర్చించారు. సత్తెనపల్లి టికెట్ మంత్రి అంబటి రాంబాబుకి ఇవ్వొద్దని.. నరసరావుపేట టికెట్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డికి ఇవ్వొద్దని, నగరిలో మంత్రి రోజాకు టికెట్‌ ఇవ్వొద్దని అసమ్మతి నేతలు కొంతకాలంగా నిరసన చేస్తున్నారు. దీంతో వారందరి పిలిపించి మాట్లాడారు జగన్. కలిపోవాలని సూచించారు. అలాగే గోదావరిజిల్లాలకు చెందిన కోలా గురువులు, తోట త్రిమూర్తులు, దాడిశెట్టి రాజా, మార్గాని భరత్‌, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌ రాజులతో సీఎం జగన్‌ మాట్లాడారు. ఎన్నికల్లో కలిసి పనిచేయాలని వారికి సూచించారు.

రెండో జాబితాపై చంద్రబాబు కసరత్తు

ఇదిలా ఉంటే అటు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం రెండో జాబితాపై కసరత్తు చేశారు. నియోజకవర్గాల నేతలను ఉండవల్లి నివాసానికి పిలిచి మాట్లాడుతున్నారు. ఈక్రమంలోనే గోపాలపురం, కొవ్వూరు, వెంకటగిరి నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు మాట్లాడారు. మరికొందరితోను చర్చించారు. టికెట్లు రాని నేతలను బాబు బుజ్జగిస్తున్నారు. రాష్ట్ర హితం కోసమే జనసేన-బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని నేతలకు వివరించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక త్యాగంచేసిన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే.. ఇవాళ టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. సుమారు 25 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మొదటి విడతలో 94 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు.. మరో 50 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాలపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. స్పష్టత వచ్చిన స్థానాల్లో చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించనున్నారు.

మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్‌ కల్యాణ్‌ బిజీబిజీ

మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్‌ కల్యాణ్‌ బిజీబిజీగా గడుపుతున్నారు. జనసేన అభ్యర్థుల జాబితాపై ఓవైపు కసరత్తులు చేస్తూనే పార్టీలో చేరికలను ప్రొత్సహిస్తున్నారు. ఈక్రమంలోనే తిరుపతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గంటా నరహరి జనసేన పార్టీలో చేరారు. పవన్ కల్యాణ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ ఎన్నికల్లో నరహరి తిరుపతి టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే 6సీట్లను ప్రకటించిన పవన్‌.. మిగిలిన 15సీట్లపై అభ్యర్థులను కసరత్తు చేస్తున్నారు. ఇవాళో రేపో సెకండ్ లిస్ట్‌ రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..